Samantha: అతని నుంచి సమంతకు మిడ్నైట్ మెసేజ్.. వాట్సాప్ స్క్రీన్ షాట్ వైరల్
Samantha Whatsapp Screen Shot: చివరిసారిగా ఖుషి మూవీతో అలరించిన ముద్దుగుమ్మ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే తన జీవితంలో జరిగే వాటిని పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సమంతకు అర్ధరాత్రి వచ్చిన ఓ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి మరి చూపించింది.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఏ మాయ చేశావే సినిమాతో అడుగు పెట్టిన బ్యూటిఫుల్ సమంత తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది. ఆ మధ్య లేడి ఒరియెంటెడ్ చిత్రాలు చేసి మంచి హిట్ కొట్టింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, యశోద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఓటీటీలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా ఉంది. ఆమె ఖుషికి ముందు కమిట్ అయిన సిటాడెల్ ఇండియన్ అడాప్షన్ సిరీస్ వంటివి పూర్తి చేసి రెస్ట్ తీసుకుంటోంది. మయోసైటిస్ చికిత్స కోసం సామ్ అమెరికా కూడా వెళ్లింది. అక్కడే పూర్తిగా కోలుకునేందుకు చికిత్స తీసుకుంటుంది. అయితే, తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని, వెకేషన్స్ వంటివాటిని సోషల్ మీడియాలో పంచుకుంటుంది సామ్. తాజాగా తన జిమ్ ట్రైనర్ జునైద్ షేక్ మెసేజ్ (Samantha About Gym Trainer) గురించి రివీల్ చేసింది.
సండే నాడు జిమ్ నుంచి కాస్తా రెస్ట్ తీసుకుందామని సమంత అనుకుంది. కానీ, సుమారు రాత్రి 11 గంటల సమయంలో జిమ్ ట్రైనర్ జునైద్ షేక్ మెసేజ్ పెట్టి మరి సామ్‌కు గుర్తు చేశాడు. నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇవాళ రెస్ట్ తీసుకుంటాను అని సమంత రిప్లై ఇచ్చింది. దానికి నేను ఇక్కడే ఉన్నాను అన్నట్లుగా జునైద్ తెలిపాడు. అంటే అప్పటికే జిమ్‌కు జునైద్ వచ్చి ఉన్నాడని అర్థం అవుతోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది సమంత.
వాట్సాప్ స్క్రీన్ షాట్ పిక్ స్టోరీ తర్వాత మరో ఫొటోను షేర్ చేసింది సమంత. అందులో సామ్ పింక్ కలర్ జిమ్ వేర్లో పుషప్ చేస్తూ కనిపించింది. ఈ ఫొటోకు "మరో దారుణమైన సండే" అని క్యాప్షన్ రాసుకొచ్చింది సమంత. ఆదివారం పూట విశ్రాంతి తీసుకుందామనుకున్న సమంతను తన జిమ్ ట్రైనర్ వదలడం లేదన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.