Salman Khan vs Vicky Kaushal: బాలీవుడ్ హీరోనే పక్కకు తోసేసిన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్-salman khan vs vicky kaushal as the bodygaurds of sallu bhai pushed the latter
Telugu News  /  Entertainment  /  Salman Khan Vs Vicky Kaushal As The Bodygaurds Of Sallu Bhai Pushed The Latter
విక్కీ కౌశల్ ను పక్కకు తోసేస్తున్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్
విక్కీ కౌశల్ ను పక్కకు తోసేస్తున్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్

Salman Khan vs Vicky Kaushal: బాలీవుడ్ హీరోనే పక్కకు తోసేసిన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్

26 May 2023, 12:45 ISTHari Prasad S
26 May 2023, 12:45 IST

Salman Khan vs Vicky Kaushal: బాలీవుడ్ హీరోనే పక్కకు తోసేశారు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆ వ్యక్తి సల్మాన్ మాజీ లవర్ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కావడం గమనార్హం.

Salman Khan vs Vicky Kaushal: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ తెలుసు కదా. అందులోనూ ఈ మధ్య కాలంలో అతనికి వస్తున్న బెదిరింపుల కారణంగా సెక్యూరిటీ కూడా పెంచారు. వాళ్లు అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎంతలా అంటే ఎదురుగా ఉన్నది ఓ బాలీవుడ్ హీరో అని కూడా చూడకుండా పక్కకు తోసేశారు.

ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు.. సల్మాన్ ఖాన్ మాజీ లవర్ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఫా 2023 (IIFA 2023) కోసం ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు అబుదాబిలో ఉన్నారు. విక్కీ ఓ అభిమానితో సెల్ఫీ దిగుతుండగా సల్మాన్ అక్కడికి వచ్చాడు. అతడు రాకముందే ఓ వ్యక్తి విక్కీని పక్కకు తీసుకెళ్లడం వీడియోలో చూడొచ్చు.

ఇక సల్మాన్ ను చూడగానే అతనికి దగ్గరికి వెళ్లడానికి విక్కీ కౌశల్ ప్రయత్నించాడు. దీంతో అతని వెనుకే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది విక్కీని వెనక్కి తోసేశాడు. అయినా అతడు మాత్రం సల్మాన్ ను విష్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన అభిమానులు సల్మాన్ తోపాటు అతని సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విక్కీ అంత మర్యాదగా ప్రవర్తిస్తున్నా.. సల్మాన్ ఎందుకు మాట్లాడటం లేదంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు.

సల్మాన్ ముందు మరో బాలీవుడ్ హీరో కూడా ఓ సాధారణ వ్యక్తే అని మరో అభిమాని అనడం విశేషం. ఆ మధ్య సల్మాన్ కు తరచూ బెదిరింపు కాల్స్ రావడంతో అతనికి సెక్యూరిటీని పెంచిన విషయం తెలిసిందే. ఇక అతని మాజీ లవర్ అయిన కత్రినా కైఫ్ ను గతేడాది విక్కీ పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లపాటు ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు.

అయితే కత్రినాను బాలీవుడ్ కు పరిచయం చేసిన సల్మాన్.. అంతకుముందు ఆమెతో కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నాడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు చాలాసార్లు వచ్చాయి. పార్ట్‌నర్, మైనే ప్యార్ క్యూ కియా, ఏక్ థా టైగర్,టైగర్ జిందా హైలాంటి సినిమాల్లో సల్మాన్, కత్రినా కలిసి నటించారు. చివరిసారి 2019లో భారత్ మూవీలో కలిసి నటించిన వీళ్లు.. టైగర్ 3లోనూ రొమాన్స్ చేయబోతున్నారు.

సంబంధిత కథనం

టాపిక్