Tiger 3 In OTT: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ 3.. ఆ సీన్లతో కలిపి స్ట్రీమింగ్-salman khan tiger 3 streaming on amazon prime ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tiger 3 In Ott: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ 3.. ఆ సీన్లతో కలిపి స్ట్రీమింగ్

Tiger 3 In OTT: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ 3.. ఆ సీన్లతో కలిపి స్ట్రీమింగ్

Sanjiv Kumar HT Telugu
Jan 07, 2024 11:10 AM IST

Tiger 3 Streaming On OTT: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీసెంట్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ టైగర్ 3 సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అప్పుడు, ఇప్పుడూ అంటూ ఊరించిన టైగర్ 3 ఓటీటీలోకి వచ్చేసి సల్మాన్ ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ 3.. ఆ సీన్లతో కలిపి స్ట్రీమింగ్
ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ 3.. ఆ సీన్లతో కలిపి స్ట్రీమింగ్

Tiger 3 Released In OTT: బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఖాన్ త్రయంలో తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక సల్మాన్ ఖాన్ ప్రతి సినిమా అభిమానలకు స్పెషల్‌గా ఉంటుంది. గత కొన్నేళ్లుగా వరుసగా ప్లాప్స్‌తో సతమతం అవుతున్నాడు భాయిజాన్ సల్మాన్ ఖాన్. ఆయన నటించిన రాధే, అంతిమ్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సల్లూ భాయ్ గెస్ట్ రోల్ చేసిన పఠాన్ ఒక్కటి మాత్రం విజయం సాధించింది.

దీంతో హిట్ కొట్టేందుకు సల్మాన్ ఖాన్ ప్రయత్నించిన మూవీనే టైగర్ 3. టైగర్ మూవీ సిరీస్‌లో భాగంగా వచ్చిన మూడో సినిమా టైగర్ 3ని యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మించారు. టైగర్ 3కి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. టైగర్ 3 సినిమాలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా కత్రీనా కైఫ్ నటించింది. ఈ ఇద్దరు ఇదివరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడోసారి టైగర్ 3 కోసం జత కట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చారు సల్మాన్, కత్రీనా కైఫ్.

ఇక ఎంతగానో ఎదురుచూసిన 'టైగర్ 3' సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 12న విడుదలైన 'టైగర్ 3' మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దాంతో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టలేకపోయింది. టైగర్ 3 సినిమా మొదట్లో రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. కానీ, ఆ రెండు రోజుల తర్వాత టైగర్ 3 కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. అందుకు కారణం వరల్డ్ కప్ 2023 ఓ కారణం అయితే, సినిమాకు మిశ్రమ స్పందన రావడం.

సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన టైగర్ 3 మూవీకి లాంగ్ రన్‌లో అన్ని భాషల్లో కలిపి ఇండియాలో రూ. 286 కోట్ల షేర్, రూ. 335 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆంటే టైగర్ 3కి సుమారు రూ. 14 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టైగర్ 3 మూవీ సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమై సల్లు భాయ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. టైగర్ 3 మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 7 నుంచి అంటే నేటి నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఇదివరకు టైగర్ 3 ఓటీటీ రిలీజ్‌పై అనేక డేట్స్ వినిపించాయి. కానీ, అవేం నిజం కాలేదు. ఇటీవల జనవరి 5న కూడా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు టాక్ వినిపించింది. ఒకరోజు ముందే త్వరలో ఓటీటీలోకి టైగర్ 3ని స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ, రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. ఈసారి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఓటీటీలోకి టైగర్ 3 సినిమాను వదిలారు మేకర్స్ అండ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ యాజమాన్యం.

అంతేకాకుండా సల్మాన్ ఖాన్ అభిమానులకు, టైగర్ సిరీస్ ఇష్టపడే ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. సెన్సార్ బోర్డ్ కట్ చేసిన, డిలీట్ చేసిన సన్నివేశాలతో కలిపి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో టైగర్ 3 మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సమాచారం. అందులో కత్రీనా కైఫ్ టవల్ ఫైట్ సీన్‌తోపాటు హాట్ సీన్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సల్లు భాయ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ వచ్చినట్లు అయింది.

Whats_app_banner