Rajinikanth Biopic: రజినీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న బాలీవుడ్ నిర్మాత! వివరాలివే-sajid nadiadwala reportedly bags kollywood super star rajinikanth biopic know the details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth Biopic: రజినీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న బాలీవుడ్ నిర్మాత! వివరాలివే

Rajinikanth Biopic: రజినీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న బాలీవుడ్ నిర్మాత! వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
May 01, 2024 08:40 PM IST

Rajinikanth Biopic: తమిళ సూపర్ రజినీకాంత్ బయోపిక్ విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఈ బయోపిక్ హక్కులను బాలీవుడ్ రచయిత, నిర్మాత సాజిద్ నడియాడ్‍వాలా దక్కించుకున్నారని సమాచారం బయటికి వచ్చింది.

Rajinikanth Biopic: రజినీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న బాలీవుడ్ నిర్మాత! వివరాలివే
Rajinikanth Biopic: రజినీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న బాలీవుడ్ నిర్మాత! వివరాలివే

Rajinikanth Biopic: తమిళ సూపర్ స్టార్, సీనియర్ హీరో రజినీకాంత్ జీవితం చాలా స్ఫూర్తిదాయకం. బస్ కండక్టర్ నుంచి కోట్లాది మంది అభిమానించే, ఆరాధించే సూపర్‌స్టార్‌గా ఆయన ఎదిగారు. రజినీ జీవితం ఆధారంగా బయోపిక్ వస్తుందంటూ కొంతకాలంగా సమాచారం వినిపిస్తోంది. ఇప్పుడు, ఆ దిశగా ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. రజినీకాంత్ బయోపిక్ రూపొందించేందుకు హక్కులను బాలీవుడ్ నిర్మాత, రచయిత సాజిద్ నడియాడ్‍వాలా సొంతం చేసుకున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

కాంట్రాక్ట్ జరిగిందా..!

రజినీకాంత్ బయోపిక్ హక్కులను నిర్మాత సాజిద్ నడియాడ్‍వాలా దక్కించుకున్నారని బాలీవుడ్ హంగామా రిపోర్ట్ వెల్లడించింది. ఇందుకుగాను బయోపిక్ నిర్మించేందుకు రజినీతో కాంట్రాక్టుకు సాజిద్ సంతకం చేశారట.

రజినీకాంత్ బయోపిక్ స్క్రిప్ట్ పనులను సాజిద్ స్వయంగా చూసుకుంటారని ఆ రిపోర్ట్ పేర్కొంది. “నటుడిగానే కాక వ్యక్తిగానూ రజినీకాంత్‍కు సాజిద్ నడియాడ్‍వాలా చాలా పెద్ద ఫ్యాన్ అని చాలా తక్కువ మందికే తెలుసు. కండక్టర్ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజినీకాంత్ స్టోరీని ఈ ప్రపంచం చూడాలని ఆయన భావిస్తున్నారు. స్క్రిప్ట్ పనులను ఆయన స్వయంగా చూసుకుంటారు. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించేలా ఆయన పని చేస్తున్నారు” అని సంబంధిత వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది.

నటుడిగా ఉన్నత శిఖరాలకు చేరిన ప్రయాణమే కాకుండా రజినీకాంత్‍లోని మానవతావాదాన్ని కూడా ఈ బయోపిక్ సినిమాలో హైలైట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవలే హింట్ ఇచ్చిన సాజిద్

సాజిద్ నడియాడ్‍వాలా ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్‍ను కలిశారు. ఆయనతో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ఇన్‍స్టాగ్రామ్‍లో ఫొటో పోస్ట్ చేశారు. దిగ్గజ రజినీకాంత్‍తో కలిసి పని చేయడం నాకు చాలా గౌరవంగా ఉందంటూ క్యాప్షన్ రాశారు. దీంతో బయోపిక్ గురించి ఆయన అప్పుడే హింట్ ఇచ్చినట్టయింది.

రజినీకాంత్ బయోపిక్ మూవీ షూటింగ్ 2025లో మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే, ఈ బయోపిక్‍పై సాజిద్ నుంచి కానీ.. రజినీ నుంచి కానీ అధికారిక ప్రకటన రాలేదు. అయితే, త్వరలోనే ఈ విషయంపై అనౌన్స్‌మెంట్ వస్తుందనే అవకాశం ఉంది.

ధనుష్ చేస్తారా?

రజినీకాంత్ బయోపిక్‍లో ఆయన పాత్రను తమిళ స్టార్ హీరో, మాజీ అల్లుడు ధనుష్ పోషిస్తారని కూడా రూమర్లు ఉన్నాయి. ఇళయరాజా, రజినీకాంత్ బయోపిక్ సినిమాలు చేయాలని కల తనకు ఉందని ధనుష్ గతంలో ఓసారి చెప్పారు. ప్రస్తుతం దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బయోపిక్‍లో ధనుష్ నటిస్తున్నారు. మరి.. రజినీకాంత్ బయోపిక్‍లోనూ ఆయనే చేస్తారేమో చూడాలి.

రజినీకాంత్ లైనప్

తన 170వ సినిమాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వెట్టైయిన్ చిత్రం చేస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా మూవీకి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‍బచ్చన్, ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి రానా, మంజూ వారియర్, రితిక సింగ్ కీలకపాత్రలు చేస్తున్నారు. ఇక, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‍తో తదుపరి చిత్రాన్ని రజినీ చేయనున్నారు. ఈ మూవీకి కూలీ అనే టైటిల్ ఖరారైంది. ఇటీవలే వచ్చిన టైటిల్ టీజర్‌ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

IPL_Entry_Point