Virupaksha Tv Premiere: బుల్లితెరలోకి విరూపాక్ష - టీవీ ప్రీమియ‌ర్ డేట్ ఇదే-sai dharam tej virupaksha to premiere on star maa on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Sai Dharam Tej Virupaksha To Premiere On Star Maa On This Date

Virupaksha Tv Premiere: బుల్లితెరలోకి విరూపాక్ష - టీవీ ప్రీమియ‌ర్ డేట్ ఇదే

HT Telugu Desk HT Telugu
Jun 22, 2023 12:38 PM IST

Virupaksha Tv Premiere: సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన విరూపాక్ష బుల్లితెర ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఏ టీవీ ఛానెల్‌లో, ఏ రోజు టెలికాస్ట్ కానుందంటే...

విరూపాక్ష మూవీ
విరూపాక్ష మూవీ

Virupaksha Tv Premiere: థియేట‌ర్ల‌తో పాటు ఓటీటీలోనూ దుమ్మురేపిన విరూపాక్ష మూవీ టీవీలోకి రాబోతున్న‌ది. ఈ సినిమా టీవీ ప్రీమియ‌ర్ డేట్‌ను ఫిక్స్‌చేశారు. జూన్ 25న సాయంత్రం ఆరు గంట‌ల‌కు స్టార్‌మా ఛానెల్‌లో ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. ఇదే ఫ‌స్ట్ తెలుగు టీవీ ప్రీమియ‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌కు సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను స్టార్ గ్రూప్ సొంతం చేసుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

ఈ శాటిలైట్ హ‌క్కుల కోసం దాదాపు ప‌దికోట్ల‌కుపైనే స్టార్‌మా వెచ్చించిన‌ట్లు స‌మాచారం. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్ సంయుక్త‌మీన‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మోస్తారు అంచ‌నాల‌తో ఏప్రిల్ 21న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది.

సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ క్రియేట్ చేసింది. ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ మూవీ అదిరిపోయే రెస్పాన్స్‌ను ద‌క్కించుకొంది.

విరూపాక్ష కథేమిటంటే...

రుద్ర‌వ‌నం అనే ఊరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. ఆ ఊరిలో జ‌రిగే వ‌రుస హ‌త్య‌ల మిస్ట‌రీని ఓ యువ‌కుడు ఎలా ఛేదించాడ‌న్న‌ది ఈ సినిమా క‌థ‌. ఇందులో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో సంయుక్త‌మీన‌న్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. విరూపాక్ష‌తో దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత సాయిధ‌ర‌మ్‌తేజ్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. బ్ర‌హ్మాజీ, సునీల్‌, రాజీవ్ క‌న‌కాల, శ్యామ‌ల కీల‌క పాత్ర‌లు పోషించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.