RRR | నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఆర్‌ఆర్‌ఆర్ సంచలనాలు
రాజమౌళి సృష్టించిన అద్భుతం ట్రిపుల్ ఆర్ రిలీజై రెండు నెలలకుపైనే అయింది. అయినా ఈ సినిమా ఏదో ఒక విశేషంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ కలెక్షన్లకు తిరుగులేదు. రూ.1200 కోట్లకుపైగానే వసూలు చేసి టాప్ 5 ఇండియన్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. సుమారు నాలుగేళ్ల పాటు శ్రమించి రూ.400 కోట్ల వరకూ ఖర్చు చేసినందుకు మేకర్స్‌కు ఈ మూవీ మంచి లాభాలనే తెచ్చి పెట్టింది. థియేటర్లలో ఈ మూవీ సృష్టించిన రికార్డుల తర్వాత ఓటీటీలోనూ మొదట పే పర్ వ్యూ కింద రిలీజ్ చేయాలని భావించారు.
అయితే ఆ తర్వాత మనసు మార్చుకొని జీ5 సబ్‌స్క్రైబర్లందరూ ఫ్రీగానే చూడొచ్చని అనౌన్స్ చేశారు. ఇటు నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ జూన్ 2న రిలీజ్ కావాల్సి ఉన్నా.. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మే 20నే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ నెట్‌ఫ్లిక్స్‌లోనే ఆర్‌ఆర్‌ఆర్ ప్రభంజనం సృష్టిస్తోంది. మన దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌ను కూడా ఈ మూవీ ఆకర్షిస్తోంది.
అందుకే ఇది నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండ్స్ చార్ట్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఈ నెల 28వ తేదీ వరకూ చూసుకుంటే ఆర్‌ఆర్‌ఆర్ పరిస్థితి ఇదీ. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఎ పర్ఫెక్ట్ పెయిరింగ్ ఈ ట్రెండ్స్‌లో టాప్‌లో ఉంది. ఇన్నాళ్లూ ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీ బెల్ట్‌లోనే తన హవా చూపించగా.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత అంతర్జాతీయంగా కూడా దూసుకెళ్తోంది.
సంబంధిత కథనం
టాపిక్