Telugu News  /  Entertainment  /  Rgv Supports Inaya Sulthana In Bigg Boss 6 Asks To Vote Her
ఇనాయా సుల్తానా
ఇనాయా సుల్తానా

RGV supports Inaya Sulthana in Bigg Boss 6: ఇనాయాకు ఓటెయ్యండి ప్లీజ్‌.. రాంగోపాల్‌ వర్మ రిక్వెస్ట్‌

18 October 2022, 21:27 ISTHT Telugu Desk
18 October 2022, 21:27 IST

RGV supports Inaya Sulthana in Bigg Boss 6: ఇనాయాకు ఓటెయ్యండి ప్లీజ్‌ అంటూ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ రిక్వెస్ట్‌ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. బిగ్‌ బాస్‌ 6 ఏడో వారం నామినేషన్ల లిస్ట్‌లో ఇనాయా కూడా ఉంది.

RGV supports Inaya Sulthana in Bigg Boss 6: డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే. ఒకప్పుడు తన సినిమాలతో ఫేమ్‌ సంపాదించిన అతడు.. ఆ తర్వాత తన చేష్టలు, వివాదాస్పద కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ మధ్యే చిరంజీవి, గరికపాటి ఇష్యూలోనూ వరుస ట్వీట్లు చేశాడు. గరికపాటిని టార్గెట్‌ చేస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇక ఇప్పుడు అతడు బిగ్‌బాస్‌ షోపై పడ్డాడు. ఆరో సీజన్‌లో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉన్న ఇనాయా సుల్తానాకు సపోర్ట్‌ చేయాలంటూ అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్‌ చేయడం విశేషం. ఏడో వారం నామినేషన్లలో ఉన్న 13 మందిలో ఇనాయా సుల్తానా కూడా ఒకరు. అయితే ఆమె హౌజ్‌ నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లు వేయాలంటూ ఆర్జీవీ కోరాడు.

"మీరు ఓట్‌ చేసి సపోర్ట్‌ చేయాల్సిన టైమ్‌ వచ్చింది. డిస్నీ+ హాట్‌స్టార్‌కు లాగిన్‌ అయి బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌ సెర్చ్‌ చేసి ఇనాయా సుల్తానాకు ఓటెయ్యండి. పది ఓట్లు వేయొచ్చు. హాట్‌ స్టార్‌ లింక్‌ ఇది. ఆమె నంబర్‌ 7288877614. ఈ నంబర్‌కు 10 మిస్డ్‌ కాల్స్‌ ఇచ్చి ఆమెను కాపాడండి" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాంగోపాల్‌ వర్మ రిక్వెస్ట్ చేశాడు.

ఇది చూసి వందల మంది ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఆమెను ఎందుకు సపోర్ట్‌ చేస్తున్నావంటూ చాలా మంది ఆర్జీవీని అడిగారు. నువ్వు చెప్పావు కాబట్టి ఓట్లేస్తామని మరికొందరు కామెంట్‌ చేశారు. బిగ్ బాస్‌ సీజన్‌ 6 రసవత్తరంగా సాగుతోంది. అయితే ఏడో వారం ఏకంగా 13 మంది నామినేట్‌ అయ్యారు. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న వారిలో గీతూ, సూర్య తప్ప మిగతా అందరూ నామినేషన్స్‌ లిస్ట్‌లో ఉన్నారు.

ఇక ఇనాయా, శ్రీహాన్‌ గొడవ కూడా కొనసాగుతోంది. గతవారం తనను నామినేట్‌ చేసిన ఇనాయాను ఈసారి శ్రీహాన్‌ నామినేట్‌ చేశాడు. కావాలనే అతడు తనపై పగ తీర్చుకుంటున్నాడని ఇనాయా ఆరోపించింది. అయితే ఆమె బిహేవియర్‌ నచ్చలేదని, ఆమె ఒక డ్రామా క్వీన్‌ అంటూ శ్రీహాన్‌ కూడా గట్టిగానే స్పందించాడు.