RGV fires on Garikapati: మెగాస్టార్ వివాదంపై గరికపాటిపై ఆర్జీవీ సెటైర్లు.. గడ్డిపరకతో పోలుస్తూ వరుస ట్వీట్లు -ram gopal varma satirical tweets on garikapati narasimha rao for megastar chiranjeevi issue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv Fires On Garikapati: మెగాస్టార్ వివాదంపై గరికపాటిపై ఆర్జీవీ సెటైర్లు.. గడ్డిపరకతో పోలుస్తూ వరుస ట్వీట్లు

RGV fires on Garikapati: మెగాస్టార్ వివాదంపై గరికపాటిపై ఆర్జీవీ సెటైర్లు.. గడ్డిపరకతో పోలుస్తూ వరుస ట్వీట్లు

Maragani Govardhan HT Telugu
Oct 11, 2022 08:16 AM IST

RGV Satire on Garikapatiగరికాపాటి-మెగాస్టార్ చిరంజీవి అంశంపై కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. చిరంజీవిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన గరికపాటిపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. ఆయనను గడ్డిపరకతో పోలుస్తూ చురకంటించారు.

<p>గరికపాటి-ఆర్జీవీ</p>
గరికపాటి-ఆర్జీవీ

Ram Gopal Varma counter to Garikapati: మెగా ఫ్యాన్స్, గరికపాటి వివాదం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై విమర్శలు విసురుతున్నారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి నరసింహరావు కొంత అసహనం వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతుంటే చిరంజీవితో అభిమానులు ఫొటోలు దిగడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం చిరంజీవి కూడా గరికపాటి వద్దకు వచ్చిన వినయంగా నమస్కరించి, ఆయన ప్రవచనాలంటే తనకు ఎంతో ఇష్టమని, క్షమించమని అడిగారు. దీంతో మెగాస్టార్ అంతటి వ్యక్తిపై గరికపాటి వ్యాఖ్యలు అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఫలితంగా చిరంజీవికి క్షమాపణలు కూడా చెప్పారు గరికపాటి. అయినా కూడా ఆయనను వదిలిపెట్టట్లేదు అభిమానులు.

ఇప్పటికే ఈ విషయంపై నాగబాబు కూడా వ్యంగ్యంగా గరికపాటిపై సెటైర్ వేయగా.. తాజాగా ఈ అంశంపై కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. చిరంజీవిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన గరికపాటిపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. ఆయనను గడ్డిపరకతో పోలుస్తూ చురకంటించారు. వరుస ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు.

"మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, త్తగ్గేదెలె..." అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. అనంతరం "హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో.." అని మరో ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతటితో ఆగకుండా "హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి" అని విమర్శించారు.

ఇంతటితో ఆగకుండా గరికపాటిని విమర్శించవద్దని అభిమానులను నాగబాబు సోషల్ మీడియా వేదికా కోరగా.. ఆ ట్వీట్‌పై కూడా ఆర్జీవీ స్పందించారు. "సర్, నాగాబాబు గారు.. మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు" అని అన్నారు. "సర్ నాగబాబు గారు.. ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ఎందుకు ఇచ్చారు సర్ సర్ సర్ చిరంజీవి??" అంటూ ఆర్జీవీ సెటైర్ వేశారు. ఈ విధంగా గరికపాటి నరసింహరావుపై వరుస ట్వీట్‌లతో ఓ రేంజ్‌లో విమర్శనాస్త్రాలను సంధించారు రామ్ గోపాల్ వర్మ. జరిగింది ఇది..

అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆ సమయంలోనే గరికపాటి నరసింహరావు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే తన మాటలను పట్టించుకోకుండా చిరంజీవితో సెల్ఫీలు తీసుకోడానికి ప్రజలు ఆత్రుత చూపించారు. దీంతో అసహనానికి గురైన గరికపాటి.. సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని, లేకపోతే వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు. దీంతో చిరు ఫొటోలు దిగడం ఆపేసి.. గరికపాటి వద్దకు వెళ్లీ క్షమించమని కోరారు. ఆయన ప్రసంగాలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆసక్తిగా వింటానని కూడా చెప్పారు. ఓ రోజు తన ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని ఆహ్వానించారు.

Whats_app_banner

సంబంధిత కథనం