Ram Gopal Varma: కృష్ణంరాజు మరణంపై రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్
Ram Gopal Varma: కృష్ణంరాజు లాంటి మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు అంటూ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర కామెంట్స్ చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అతడి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
Ram Gopal Varma: కృష్ణంరాజు మరణంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు సిగ్గు’ అంటూ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించాడు.
అంతే కాకుండా ‘కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి(Chiranjeevi) గారికి, మోహన్ బాబు గారికి, బాలయ్యకి, ప్రభాస్(Prabhas), మహేష్, పవన్ కళ్యాణ్ కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
ట్విట్టర్ ద్వారా అతడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తెలుగు సినీ పరిశ్రమపై ఘాటుగానే కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వర్మ కామెంట్స్ ను కొందరు సమర్థిస్తుండగా చాలా మంది విమర్శిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.