Manchu Vishnu: పుష్ప 2 వస్తోందని.. కన్నప్ప వాయిదా పడింది? అసలు రీజన్ చెప్పిన మంచు విష్ణు-actor manchu vishnu kannappa movie postponed reason here not reason pushpa 2 the rule release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Vishnu: పుష్ప 2 వస్తోందని.. కన్నప్ప వాయిదా పడింది? అసలు రీజన్ చెప్పిన మంచు విష్ణు

Manchu Vishnu: పుష్ప 2 వస్తోందని.. కన్నప్ప వాయిదా పడింది? అసలు రీజన్ చెప్పిన మంచు విష్ణు

Galeti Rajendra HT Telugu

Manchu Vishnu Kannappa release date: మంచు విష్ణు సినిమా కన్నప్పు ఇప్పటికే రెండు వాయిదాలు పడి వచ్చే ఏడాది ఏప్రిల్‌కి వెళ్లిపోయింది. డిసెంబరులో రావాల్సిన సినిమా ఎందుకు నెక్ట్స్ ఇయర్‌కి వెళ్లిపోయిందంటే?

కన్నప్ప రిలీజ్‌ వాయిదాకి కారణం ఇదే

మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీ.. తొలుత ఆగస్టులో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత అది డిసెంబరుకి వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబరు నుంచి వచ్చే ఏఢాది ఏప్రిల్‌కి వెళ్లిపోయింది. ఇలా కన్నప్ప వాయిదాలు పడటానికి కారణమేంటి? డిసెంబరులో పుష్ప 2 వస్తోందని.. వాయిదా వేశారు? ఈ ప్రశ్నకి మంచు విష్ణు శుక్రవారం సమాధానం ఇచ్చారు.

‘‘నిజమే.. కన్నప్ప సినిమాని తొలుత ఆగస్టులో రిలీజ్ చేయాలని భావించాం. కానీ.. అప్పటికి వర్క్స్ పూర్తవలేదు. దాంతో డిసెంబరులోనైనా థియేటర్లలోకి రావాలని ఆశించాం. కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తవలేదు. దాంతో కన్నప్ప వాయిదా తప్పలేదు. అయినా.. డిసెంబరులో చెప్పారు కదా.. విడుదల చేయలేదేంటి? అని ఎవరూ అడగరు. వాళ్లకి కావాల్సింది మంచి సినిమా’’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

పుష్ప 2 కారణం కాదు

పుష్ప 2 కారణంగానే డిసెంబరు నుంచి తప్పుకున్నారా? అని ప్రశ్నించగా.. ‘‘పుష్ప 2 సినిమా వస్తోందని కన్నప్ప మూవీ వాయిదాపడలేదు. అయినా.. ఈ రెండు సినిమాల డిస్ట్రిబ్యూటర్లు ఒక్కరే. అలానే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అప్పుడు ఒకరితో మరొకరు మాట్లాడుకునే నిర్ణయం తీసుకుంటారు. ఓ మంచి చిత్రాన్ని అందించాలనే లక్ష్యంతో సినిమా కోసం పనిచేస్తున్నాం. కన్నప్ప మూవీకి వీఎఫ్‌ఎక్స్‌ పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఇంకా పూర్తవలేదు ’’ అని వెల్లడించారు.

పారిస్‌లో సీక్వెన్స్

కన్నప్ప మూవీ ఏ స్టేజ్‌లో ఉందో చెప్తూ ‘‘సినిమాలో ఒక కీలక సీక్వెన్స్‌కి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం పారిస్‌లో జరుగుతోంది. డిసెంబరు చివరి నాటికి అది పూర్తవుతుంది. అలానే అన్నపూర్ణ స్టూడియోస్‌‌లోనూ కొంచెం వర్క్ జరుగుతోంది. అన్నీ ఆ పరమ శివుడే చూసుకుంటారు’’ అని మంచు విష్ణు ధీమా వ్యక్తం చేశారు.

కన్నప్పకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న మంచు మోహన్‌ బాబు సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రభాస్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. అలానే శరత్‌కుమార్‌, మధుబాల, ప్రీతి ముకుందన్‌ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

కన్నప్ప రిలీజ్ ఎప్పుడంటే?

డిసెంబరు 5న అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. రెండు సార్లు వాయిదాపడిన కన్నప్ప.. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలోకిరానుంది.