Telugu News  /  Entertainment  /  Bigg Boss 6 Telugu Voting Can Be Done By Giving Missed Calls Or Through Hotstar App
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్లు వీళ్లే
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్లు వీళ్లే (Twitter)

Bigg Boss 6 Telugu Voting: బిగ్‌ బాస్‌లో మీ ఫేవరెట్లకు ఓటెలా వేయాలి? మిస్డ్‌కాల్ నంబర్స్‌ ఏవి?

20 September 2022, 17:07 ISTHT Telugu Desk
20 September 2022, 17:07 IST

Bigg Boss 6 Telugu Voting: బిగ్‌ బాస్‌ 6లో మీ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకు ఓటెలా వేయాలి? మిస్డ్‌కాల్ ద్వారా ఓటేయవచ్చా? హాట్‌స్టార్‌ యాప్‌ ద్వారా ఓటు ఎలా వేయాలో తెలుసా?

Bigg Boss 6 Telugu Voting: బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ మూడో వారంలోకి ఎంటరైంది. ఈసారి ఈ రియాల్టీ షోలోకి మొత్తం 20 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అయితే ప్రతి వారం వీళ్లలో నామినేషన్లు, ఎలిమినేషన్లు జరుగుతాయన్న విషయం తెలుసు కదా. తోటి కంటెస్టెంట్లు నామినేట్‌ చేసిన వారిని కూడా షోలో కొనసాగించే అవకాశం ప్రేక్షకులకు ఉంది. ఓటింగ్‌ ద్వారా మీ ఫేవరెట్‌ కంటెస్టెంట్లను కాపాడుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

అయితే బిగ్‌ బాస్‌లో ఓటు వేయడానికి కూడా భిన్నమైన మార్గాలు ఉన్నాయి. కేవలం మిస్డ్‌ కాల్‌ ద్వారా ఓటేసే అవకాశం ఉంటుంది. ఒక్కో కంటెస్టెంట్‌కు ఒక్కో నంబర్‌ ఉంటుంది. ఆ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా మీ ఓటు వారికి వేయొచ్చు. లేదంటే డిస్నీ+ హాట్‌స్టార్‌ యాప్‌ ద్వారా కూడా ఓటు వేసే అవకాశం ఉంది.

మిస్డ్‌కాల్‌ ఇవ్వాల్సిన నంబర్లు ఇవే

ఒకవేళ నామినేట్‌ అయిన వాళ్లలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఉంటే వాళ్లకు కేటాయించిన నంబర్లకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా ఓటు వేసి వాళ్లను కాపాడుకునే వీలుంటుంది. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో కంటెస్టెంట్‌కు గరిష్ఠంగా 10 మిస్డ్‌ కాల్స్‌ ఇవ్వొచ్చు. ఈ ఆరో సీజన్‌లో ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయిపోగా.. మరో 18 మంది గేమ్‌లో ఉన్నారు. వాళ్ల మిస్డ్‌ కాల్‌ నంబర్స్‌ ఇవీ.

ఆది రెడ్డి - 7288877617

బాలాదిత్య - 7288877611

అర్జున్‌ కల్యాణ్‌ - 7288877607

ఆరోహి రావ్‌ - 7288877619

చలాకీ చంటి - 7288877605

ఫాయిమా - 7288877616

గీతూ రాయల్‌ - 7288877608

ఇనాయా సుల్తానా - 7288877614

కీర్తి భట్‌ - 7288877601

రోహిత్‌ & మరీనా సాహ్ని - 7288877610

నేహా చౌదరి - 7288877604

రేవంత్‌ - 7288877620

శ్రీసత్య - 7288877606

శ్రీహాన్‌ - 7288877603

సుదీప పింకీ - 7288877602

ఆర్జే సూర్య - 7288877615

రాజశేఖర్‌ - 7288877618

వాసంతి కృష్ణన్‌ - 7288877612

హాట్‌స్టార్‌ యాప్‌ ద్వారా ఓటింగ్‌ ఇలా..

ఇక ఒకవేళ మీరు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ షో చూస్తుంటే.. ఈ యాప్‌ ద్వారా కూడా కంటెస్టెంట్లకు ఓటు వేయవచ్చు. ఈ యాప్‌లో బిగ్‌ బాస్‌ తెలుగు షోలోకి వెళ్లి.. అక్కడున్న ఓటు బటన్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ మీ ఫేవరెట్‌ కంటెస్టెంట్‌కు ఓటు వేయొచ్చు.

ఒక్కరికే వేయొచ్చు లేదంటే ఆ ఓటును నామినేట్‌ అయిన వాళ్లందరికీ పంచే వీలు కూడా ఉంటుంది. సెలక్షన్‌ అయిపోయిన తర్వాత డన్‌ బటన్‌ నొక్కాలి. ఒక ఎపిసోడ్‌కు ఒక కంటెస్టెంట్‌కు గరిష్ఠంగా పది ఓట్లు వేయొచ్చు.