Telugu OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చిన టాలీవుడ్ లవ్ డ్రామా మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Telugu OTT: రెజీనా హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ ఉత్సవం సెలైంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దిలీప్ ప్రకాష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.
Telugu OTT: రెజీనా హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ఉత్సవం థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శుక్రవారం సెలైంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ రిలీజైంది. ఉత్సవం సినిమాలో దిలీప్ ప్రకాష్ హీరోగా నటించాడు.
ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. అంతరించిపోతున్న నాటక రంగ ఔన్నత్యానికి లవ్‌స్టోరీని జోడించి దర్శకుడు అర్జున్ సాయి ఈ మూవీని తెరకెక్కించాడు.
మంచి సినిమాగాగా పేరొచ్చిన ఉత్సవం కమర్షియల్‌గా మాత్రం ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
కృష్ణ, రమ ప్రేమకథ...
కృష్ణ (దిలీప్ ప్రకాష్) ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా అంతరించిపోతున్న నాటక రంగానికి బతికించేందుకు తపన పడుతుంటాడు. కృష్ణ తండ్రి అభిమన్యు నారాయణ (ప్రకాష్ రాజ్) రంగస్థల కళాకారుడిగా గొప్ప పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు.
కొడుకు తనలా నాటకాల్లోకి రాకుండా మంచి జాబ్ చేయాలని అభిమన్యు నారాయణ కలలు కంటుంటాడు.మరో రంగస్థలకారుడు మహాదేవనాయుడు (నాజర్) కూతురు రమతో (రెజీనా) కృష్ణ పెళ్లిని ఫిక్సవుతుంది పెళ్లికి కొద్ది గంటల ముందు రమ, కృష్ణ కనిపించకుండాపోతారు.
వారి మిస్సింగ్ వెనకున్న కారణమేమిటి? పెళ్లి కుదరడానికి ముందే ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడ్డ కృష్ణ, రమ ఎలా విడిపోయారు? ప్రేమ జంట మధ్య మనస్పర్థలకు కారణమేమిటి? తమకు పెద్దలు పెళ్లి కుదిర్చిన విషయం కృష్ణ, రమలకు ఎలా తెలిసింది? ఈ యువజంట ప్రేమకథ ఎలా సుఖాంతమైంది అన్నదే ఉత్సవం మూవీ కథ.
అనూప్ రూబెన్స్ మ్యూజిక్...
హీరోగా దిలీప్ ప్రకాష్‌కు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. దర్శకుడిగా అర్జున్ సాయి ఉత్సవం మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఉత్సవం మూవీకి అనూర్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. తెలుగులో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. దాదాపు ఏడాది తర్వాత ఉత్సవం మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది రెజీనా.
అజిత్ మూవీలో…
ఒకప్పుడు తెలుగులో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ వచ్చింది రెజీనా. పరాజయాలతో కొత్త హీరోయిన్ల జోరుతో రెజీనాకు తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. తమిళం, హిందీ భాషల్లో హీరోయిన్‌గా కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ ఎక్కువగా చేస్తోంది. అజిత్ హీరోగా నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ విదా ముయార్చిలో రెజీనా నెగెటివ్ షేడ్ రోల్ చేయనుంది. హిందీలో జట్, సెక్షన్ 8 సినిమాలు చేస్తోంది రెజీనా.