Ranveer Singh: రూ.119 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్న బాలీవుడ్ హీరో
Ranveer Singh: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ముంబైలో ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్ కొన్నాడు. దీనికోసం అతడు ఏకంగా రూ.118.94 కోట్లు ఖర్చు చేయడం విశేషం.
బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు, దీపికా పదుకోన్ భర్త రణ్‌వీర్ సింగ్, అతని తండ్రి జగ్‌జీత్ సుందర్‌సింగ్ భవ్‌నానీ కలిసి ముంబైలోని ఓ లగ్జరీ బిల్డింగ్‌లో ఖరీదైన అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేశాడు. బాంద్రాలోని సాగర్ రేషమ్ బిల్డింగ్‌లో 16వ అంతస్తులో ఓ అపార్ట్‌మెంట్, 17 నుంచి 19వ ఫ్లోర్ వరకూ ఉన్న ఓ ట్రిప్లెక్స్ కొనడం విశేషం. వీటి మొత్తం విలువ రూ.118.94 కోట్లు.
ఈ మొత్తం ప్రాపర్టీలో భాగంగా 19 కార్లు పార్కింగ్ చేసుకునే స్థలంతోపాటు విశాలమైన టెర్రస్ కూడా వచ్చింది. ఈ ప్రాపర్టీని రణ్‌వీర్, అతని తండ్రి జగ్‌జీత్ డైరెక్టర్లుగా ఉన్న ఓ ఫైవ్ ఓ మీడియా వర్క్స్ ద్వారా కొనుగోలు చేశారు. ఈ అపార్ట్‌మెంట్, ట్రిప్లెక్స్ కలిపి మొత్తం 11266 చదరపు అడుగులు ఉండటం విశేషం. ఆ లెక్కన ఒక్కో చదరపు అడుగు ధర రూ. లక్షపైనే ఉంటుంది.
ఈ నెల 9న ఈ ప్రాపర్టీ రణ్‌వీర్ సొంతమైంది. దీనికోసం రూ.7.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రణ్‌వీర్ ఇల్లు కొనుక్కున్న బాంద్రా బాండ్‌స్టాండ్ ఏరియాలో అందరూ హైప్రొఫైల్ వాళ్లే ఉంటారు. ఇక సాగర్ రేషమ్ బిల్డింగ్ బాలీవుడ్ సూపర్‌స్టార్లు షారుక్‌ఖాన్, సల్మాన్ ఖాన్ ఇళ్లకు దగ్గరగానే ఉంటుంది. ముంబైలోని బాంద్రా, జుహు ప్రాంతాల్లోనే చాలా మంది బాలీవుడ్ స్టార్లు, బడా పారిశ్రామికవేత్తలు ఉంటారు.
సంబంధిత కథనం