Rani Mukerji: ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది విడాకులు తీసుకున్నారు: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్-rani mukerji shocking comments over kabhi alvida naa kehna movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rani Mukerji: ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది విడాకులు తీసుకున్నారు: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

Rani Mukerji: ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది విడాకులు తీసుకున్నారు: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Nov 27, 2023 05:45 PM IST

Rani Mukerji: బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ షాకింగ్ కామెంట్స్ చేసింది. కభీ అల్విద నా కహెనా మూవీ చూసిన తర్వాత చాలా మంది విడాకులు తీసుకున్నారని ఆమె అనడం గమనార్హం.

బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ (AFP)

Rani Mukerji: గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ షాకింగ్స్ కామెంట్స్ చేసింది. తాను నటించిన కభీ అల్విద నా కహెనా (Kabhi Alvida Naa Kehna) మూవీ చూసిన తర్వాత ఎంతో మంది విడాకులు తీసుకున్నట్లు ఆమె చెప్పడం గమనార్హం. ఈ సినిమా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ డైరెక్ట్ చేశాడు.

ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో మంది సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాణీ ముఖర్జీ చెప్పింది. "కభీ అల్విద నా కహెనీ మూవీ రిలీజ్ తర్వాత ఏం జరిగిందంటే.. చాలా విడాకులు నమోదయ్యాయి. చాలా మంది థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను కాస్త అసౌకర్యంగానే చూశారు. ఈ సినిమాకు కరణ్ కు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఇలాగే ఉంది. ఈ సినిమా చాలా మంది కళ్లు తెరిపించింది. సంతోషంగా ఉండాలని చాలా మంది నిర్ణయించుకున్నారు" అని రాణీ ముఖర్జీ చెప్పింది.

కభీ అల్విద నా కహెనా మూవీలో రాణీ ముఖర్జీతోపాటు షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ప్రీతి జింటా నటించారు. ఇష్టం లేని కాపురం చేయలేక సినిమాలో ఈ రెండు జంటలు తమ భర్త లేదా భార్యను వదిలేసి మరొకరితో కలిసి జీవిస్తారు. ఆ విషయంలో ఈ సినిమా చాలా మంది కళ్లు తెరిపించిందని రాణీ చెప్పడం విశేషం. ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా ఆమె ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.

"ఇందులోని మాయ పాత్ర ఎంతో అందమైనది. ఆమె రిషీని మరో విధంగా ప్రేమిస్తుంది. షారుక్ ఖాన్ పోషించిన పాత్రలో ఆమె తాను ఎప్పుడూ కోరుకునే రొమాన్స్ ను గుర్తిస్తుంది. ఓ మహిళ కోరికలు, ఆమె ఏం కావాలనుకుంటుంది అన్నదానిపై మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ భర్త కేవలం కొట్టకపోయినంత మాత్రాన అతడు బెడ్ పై బాగా ఉంటాడని లేదంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని కాదు. ఈ మగాడిని చూసి ఆకర్షితురాలివి అయ్యావా అని ఎవరూ ఓ మహిళను అడగరు" అని రాణీ ముఖర్జీ చెప్పింది.

ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాణీ ముఖర్జీ ఈ మధ్యే మిసెస్ ఛటర్జీ వెర్సెస్ నార్వే సినిమాలో కనిపించింది. నార్వేలో ఓ భారతీయ మహిళకు ఎదురైన చేదు అనుభవం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.