Brahmastra Day 1 Collection: తెలుగులో బ్ర‌హ్మాస్త్ర రికార్డ్ క‌లెక్ష‌న్స్ - బాలీవుడ్ డ‌బ్బింగ్ సినిమాల్లో ఇదే హ‌య్యెస్ట్‌-ranbir kapoor brahmastra day 1 collection in telugu states
Telugu News  /  Entertainment  /  Ranbir Kapoor Brahmastra Day 1 Collection In Telugu States
ర‌ణ్‌భీర్‌క‌పూర్‌
ర‌ణ్‌భీర్‌క‌పూర్‌ (Twitter)

Brahmastra Day 1 Collection: తెలుగులో బ్ర‌హ్మాస్త్ర రికార్డ్ క‌లెక్ష‌న్స్ - బాలీవుడ్ డ‌బ్బింగ్ సినిమాల్లో ఇదే హ‌య్యెస్ట్‌

10 September 2022, 14:36 ISTNelki Naresh Kumar
10 September 2022, 14:36 IST

Brahmastra Day 1 Collection: ర‌ణ్‌భీర్‌క‌పూర్‌,అలియాభ‌ట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రానికి తెలుగులో మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే...

Brahmastra Day 1 Collection: ర‌ణ్‌భీర్‌క‌పూర్‌, అలియాభ‌ట్ జంట‌గా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాపై బాలీవుడ్‌తో పాటు తెలుగులో భారీగా ఎక్ప్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ఈ సినిమా సౌత్ వెర్ష‌న్స్‌కు అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్ర‌మోష‌న్స్‌లో ర‌ణ్‌భీర్‌, అలియా సంద‌డి చేయ‌డంతో తెలుగు ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఈ వారం విడుద‌లైన తెలుగు స్ట్రెయిట్ సినిమాల‌కు పోటీగా అత్య‌ధిక థియేట‌ర్ల‌లో బ్రహ్మాస్త్రం పేరుతో ఈ సినిమా విడుద‌లైంది. ర‌ణ్‌భీర్, అలియా కెమిస్ట్రీతో పాటు నాగార్జున‌, అమితాబ్‌బ‌చ్చ‌న్ యాక్టింగ్ బాగుంద‌ని ప్రశంసలు వచ్చినా క‌థ‌, క‌థ‌నాల్లో కొత్తదనం లేక‌పోవ‌డంతో బ్ర‌హ్మాస్త్రం యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

తెలుగులో మొదటిరోజు బ్రహ్మాస్త్రం 6.70 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. నైజాంలో 1.85 కోట్ల వసూళ్లను రాబట్టింది. సీడెడ్ లో 42 లక్షలు, ఉత్తరాంధ్రలో 40 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో 18 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. గుంటూర్ 27, కృష్ణ 15, నెల్లూరులో 15 లక్షల కలెక్షన్స్ దక్కించుకున్నది. మొత్తంగా తొలిరోజు సినిమా 6.70 కోట్ల గ్రాస్...3.65 కోట్ల షేర్ ను రాబట్టింది.

తెలుగులో ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ధూమ్ 3 చిత్రం 4.70 కోట్ల గ్రాస్ తో తెలుగు స్టేట్స్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ధూమ్ 3 రికార్డును బ్రహ్మాస్త్రం అధిగమించింది. రాజమౌళి క్రేజ్ కారణంగా తెలుగులో ఈ సినిమా ఐదు కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అందులో మొదటిరోజే సగానికి పైగా వసూళ్లను రాబట్టింది. మరో రెండు కోట్ల కలెక్షన్స్ వస్తే నిర్మాతలు సేఫ్ అయినట్లేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 75 కోట్ల వసూళ్లు(Brahmastra Day 1 Collection)

వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మొదటి రోజు 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హిందీతో పాటు అన్ని భాషల్లో సినిమా చక్కటి కలెక్షన్స్ వస్తున్నాయని పేర్కొన్నది. 2డీ వెర్షన్ తో పాటు త్రీడీకి కూడా చక్కటి ఆదరణ లభిస్తుందని వెల్లడించింది.