Ram Charan Game Changer Release Date: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఇదేనా.. ఇంట్రెస్టింగ్ బజ్-ram charan game changer tentative release date buzz created in industry ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan Game Changer Tentative Release Date Buzz Created In Industry

Ram Charan Game Changer Release Date: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఇదేనా.. ఇంట్రెస్టింగ్ బజ్

Hari Prasad S HT Telugu
Nov 12, 2023 09:45 AM IST

Ram Charan Game Changer Release Date: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే అంటూ ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేటైంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమవుతున్న విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ మూవీ
గేమ్ ఛేంజర్ మూవీ

Ram Charan Game Changer Release Date: రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ ను ఆసక్తిగా గమనిస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో చరణ్ చేస్తున్న మూవీ కావడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేటైంది.

ట్రెండింగ్ వార్తలు

గేమ్ ఛేంజర్ మూవీని వచ్చే ఏడాది దసరా సమయంలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటనేదీ రాకపోయినా.. మేకర్స్ మాత్రం ఆ సమయం అయితే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికే వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఓవైపు శంకర్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో గేమ్ ఛేంజర్ ఆలస్యమవుతోంది.

దీంతో వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్ కు రావచ్చనీ భావించారు. కానీ తాజాగా దసరా టైమ్ కి అనే బజ్ క్రియేటైన నేపథ్యంలో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ సినిమాలో చాలా వరకూ షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. ఇక భారీ ఖర్చుతో తీసిన ఫస్ట్ సింగిల్ జరగండి సాంగ్ రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యే ఈ పాటకు సంబంధించిన ఫొటోను రిలీజ్ చేస్తూ త్వరలోనే అని మేకర్స్ అని చెప్పినా.. అది ఎప్పుడు అన్నది మాత్రం తెలియడం లేదు.

గేమ్ ఛేంజర్.. నెక్ట్స్ షెడ్యూల్

మరోవైపు గేమ్ ఛేంజర్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ పై కూడా ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ నవంబర్ 23 నుంచి మైసూరులో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ తోపాటు సినిమాలోని ముఖ్యమైన పాత్రధారులందరూ పాల్గొననున్నట్లు సమాచారం. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్యలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.