Game Changer: గేమ్ చేంజర్ ఆడియో రైట్స్ కు భారీ ధర.. పాన్ ఇండియా సినిమాల్లోనే ఇదే హయ్యెస్ట్!
Game Changer Audio Rights: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటిఫుల్ కియారా అద్వానీ మరోసారి జంటగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఆడియో హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. కోట్లల్లో ధర చెల్లించి సరేగమ ఆడియో కంపెనీ గేమ్ చేంజర్ ఆడియో రైట్స్ కొనుగోలు చేసింది.
Game Changer Audio Rights To Saregama: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తున్న సినిమా గేమ్ చేంజర్. సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ అయిన శంకర్ మొదటిసారి తెలుగు హీరోతో సినిమా చేయడంతో గేమ్ చేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ చేంజర్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు.
50వ సినిమా
శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థకు గేమ్ చేంజర్ 50వ సినిమా కావడం విశేషం. అయితే, గేమ్ చేంజర్ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్స్, రామ్ చరణ్ రోల్స్ రూమర్స్ తెగ బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల జరగండి అనే పాట కూడా లీక్ అవడంతో మరోసారి గేమ్ చేంజర్‌పై అందరి ఫోకస్ వెళ్లింది. గేమ్ చేంజర్ సినిమాలోని జరగండి అనే పాటను దివాళీ కానుకగా అధికారికంగా విడుదల చేయనున్నారు.
రికార్డు లెవెల్లో
ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా ఆడియో రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. గేమ్ చేంజర్ మ్యూజిక్ హక్కులను ప్రముఖ ఆడియో కంపెనీ సరేగమ సొంతం చేసుకుంది. అందుకు రూ. 33 కోట్లు చెల్లించడానికి సరేగమ అంగీకారం తెలిపిందని సమాచారం. అయితే, ఒక్క పాట కూడా విడుదల కాకముందే రికార్డు లెవెల్లో మ్యూజిక్ రైట్స్ కు ఇంత డబ్బు రావడం హాట్ టాపిక్ అవుతోంది. పాన్ ఇండియా సినిమాల్లో హయ్యెస్ట్ ధర గేమ్ చేంజర్‌కే వచ్చిందని ఫిల్మ్ వర్గాల నుంచి టాక్.
మరో మూవీకి కూడా
ఇక గేమ్ చేంజర్ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి జత కట్టనుంది. గేమ్ చేంజర్ సినిమాలో చెర్రీ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని ఇదివరకే వార్తలు వచ్చాయి. మరో పాత్రకు అంజలి జోడీ కట్టనుంది. కాగా గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ మరో మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దానికి కూడా భారీ స్థాయిలో ఆడియో రైట్స్ అమ్ముడు పోయే అవకాశం కనిపిస్తోంది.