Rajamouli on Prabhas: న‌న్ను న‌మ్మిన మొద‌టి వ్య‌క్తివి నువ్వు - ప్ర‌భాస్‌పై రాజ‌మౌళి ప్రశంసలు-rajamouli interesting comments on prabhas ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli On Prabhas: న‌న్ను న‌మ్మిన మొద‌టి వ్య‌క్తివి నువ్వు - ప్ర‌భాస్‌పై రాజ‌మౌళి ప్రశంసలు

Rajamouli on Prabhas: న‌న్ను న‌మ్మిన మొద‌టి వ్య‌క్తివి నువ్వు - ప్ర‌భాస్‌పై రాజ‌మౌళి ప్రశంసలు

Nelki Naresh Kumar HT Telugu
Dec 13, 2022 02:45 PM IST

Rajamouli on Prabhas: తాను ప్ర‌పంచ‌స్థాయి ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుంటాన‌ని న‌మ్మిన మొద‌టి వ్య‌క్తి ప్ర‌భాస్ అని రాజ‌మౌళి పేర్కొన్నాడు. ప్ర‌భాస్‌ను ఉద్దేశిస్తూ రాజ‌మౌళి చేసిన కామెంట్స్‌ సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారాయి.

రాజ‌మౌళి, ప్ర‌భాస్‌
రాజ‌మౌళి, ప్ర‌భాస్‌

Rajamouli on Prabhas: ద‌ర్శ‌కుడిగా తాను ప్ర‌పంచ‌స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటాన‌ని న‌మ్మిన మొద‌టి వ్య‌క్తి ప్ర‌భాస్ అని తెలిపాడు రాజ‌మౌళి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ సినిమా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్‌, లాస్ ఎంజిలాస్ క్రిటిక్స్ అవార్డ్స్ వేడుక‌ల్లో స‌త్తా చాటింది.

న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్‌లో బెస్ట్ డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళి అవార్డును అందుకోగా లాస్ ఎంజిలాస్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్‌లో కీర‌వాణికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పుర‌స్కారం ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళిని అభినందిస్తూ ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.

ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి సినీ ప్ర‌పంచాన్ని ఏలుతున్నాడ‌ని ప్ర‌భాస్ అన్నాడు. బెస్ట్ డైరెక్ట‌ర్‌గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ అవార్డుతో పాటు లాస్ ఎంజిలాస్‌లో బెస్ట్ డెరైక్ట‌ర్‌గా ర‌న్న‌ర‌ప్ అవార్డ్ రాజ‌మౌళి అందుకోవ‌డం ఆనందంగా ఉంది అంటూ పేర్కొన్నాడు. రాజ‌మౌళితో పాటు కీర‌వాణికి ప్ర‌భాస్ శుభాకాంక్ష‌లు అంద‌జేశాడు. ప్ర‌భాస్ పోస్ట్‌కు రాజ‌మౌళి స్పందించాడు.

ప్ర‌పంచ‌స్థాయి ద‌ర్శ‌కుడిగా నేను పేరు తెచ్చుకుంటాన‌ని నాకంటే ముందు న‌న్ను న‌మ్మిన వ్య‌క్తి వి నువ్వు థాంక్స్ డార్లింగ్‌ అంటూ రిప్లై ఇచ్చారు. ప్ర‌భాస్‌, రాజ‌మౌళి మ‌ధ్య సాగిన సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో సినీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌భాస్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఛ‌త్ర‌ప‌తితో పాటు బాహుబ‌లి, బాహుబ‌లి -2 సినిమాలు రూపొందాయి. బాహుబ‌లితో ప్ర‌భాస్ పాన్ ఇండియ‌న్ స్టార్‌గా మారిపోయాడు.

Whats_app_banner