Pushpa 2 OTT: రిలీజ్ రోజే పుష్ప 2 ఓటీటీపై జోరుగా చర్చ.. అల్లు అర్జున్ మాస్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్‌ కానుందంటే?-pushpa 2 ott release allu arjun starrer movie will be releasing on streaming giant netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Ott: రిలీజ్ రోజే పుష్ప 2 ఓటీటీపై జోరుగా చర్చ.. అల్లు అర్జున్ మాస్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్‌ కానుందంటే?

Pushpa 2 OTT: రిలీజ్ రోజే పుష్ప 2 ఓటీటీపై జోరుగా చర్చ.. అల్లు అర్జున్ మాస్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్‌ కానుందంటే?

Galeti Rajendra HT Telugu
Dec 05, 2024 02:22 PM IST

Pushpa 2 OTT Release: థియేటర్లలో పుష్ప2 సందడి మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్‌లో పుష్ప2 మూవీ రిలీజ్ అవగా.. తొలిరోజే భారీగా వసూళ్లని రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ మూవీ ఓటీటీ హక్కుల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

పుష్ప 2 ఓటీటీ
పుష్ప 2 ఓటీటీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2:ది రూల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం థియేటర్లలోకి వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 12,500 థియేటర్లలో రిలీజ్ అవగా.. తొలిరోజే రూ.250 కోట్ల వరకూ పుష్ప 2 వసూళ్లని రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ అత్యధిక ఓపెనింగ్ వసూళ్ల రికార్డ్ ఆర్ఆర్ఆర్‌ పేరిట ఉండగా.. ఆ మూవీ రూ.223 కోట్లని వసూలు చేసింది.

yearly horoscope entry point

ఓటీటీలోకి పుష్ప 2 ఎప్పుడు?

పుష్ప 2 మూవీ ఒకవైపు థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు కొంత మంది నెటిజన్లు పుష్ప ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది..? ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి రానుంది? అని తెగ శోధిస్తున్నారు.

వాస్తవానికి పుష్ప 2 మూవీ టికెట్ ధరలు దేశ వ్యాప్తంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో రూ.500 నుంచి రూ.1,500 వరకూ ఉన్నాయి. దాంతో టికెట్ ధరలపై విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

ఫ్యాన్సీ రేటుకి పుష్ప2 ఓటీటీ ధర

పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్, రష్మిక మంధానతో పాటు ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రేజీ హీరోయిన్ శ్రీలీల కిస్సిక్ అనే ఐటెం సాంగ్ చేసింది. అనసూయ, సునీల్ పాత్రలు కూడా కొనసాగాయి. అయితే.. పుష్ప 2లో ఈ ఇద్దరి పాత్ర చాలా పరిమితంగా కనిపించింది.

పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తున్న పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం.. రూ.275 కోట్లకి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి వరకూ ఆగాల్సిందేనా?

సాధారణంగా సినిమా రిలీజైన 6-8 వారాల్లో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే స్ట్రీమింగ్‌కి వచ్చేశాయి. కానీ.. పుష్ప2 మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో.. కొంచెం ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. డిసెంబరులో ఏ పెద్ద సినిమా లేకపోవడంతో.. సంక్రాంతి వరకూ థియేటర్లలో పుష్ప 2కి పెద్దగా పోటీ కనబడటం లేదు. దాంతో.. పుష్ప 2 ఓటీటీలోకి వచ్చేది సంక్రాంతికి లేదా.. జనవరి చివర్లోనే అనే వార్తలు వస్తున్నాయి.

Whats_app_banner