OTT Action Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మరికొన్ని గంటల్లోనే..-ott action thriller movie jigra to stream on netflix from friday 6th december ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మరికొన్ని గంటల్లోనే..

OTT Action Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మరికొన్ని గంటల్లోనే..

Hari Prasad S HT Telugu
Dec 05, 2024 01:30 PM IST

OTT Action Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మరికొన్ని గంటల్లోనే..
ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మరికొన్ని గంటల్లోనే..

OTT Action Thriller: ఓటీటీలోకి బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జిగ్రా (Jigra) రాబోతోంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం దారుణంగా బోల్తా పడింది. నష్టాలనే మిగిల్చింది.

జిగ్రా ఓటీటీ రిలీజ్ డేట్

ఆలియా భట్ నటించిన జిగ్రా మూవీ శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ గురువారం (డిసెంబర్ 5) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "ధైర్యం అందించే స్వేచ్ఛను ఏ గోడలూ అడ్డుకోలేవు. జిగ్రా నెట్‌ఫ్లిక్స్ లోకి డిసెంబర్ 6న రాబోతోంది" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.

ఈ సినిమా థియేటర్లలో తెలుగులోనూ రిలీజైంది. దీంతో ఇప్పుడు ఓటీటీలోకి కూడా తెలుగులో అందుబాటులోకి రానుంది. సుమారు రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం కేవలం రూ.55 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మూవీకి మంచి రివ్యూలే వచ్చినా.. ప్రేక్షకులు ఆదరించలేదు.

జిగ్రా మూవీ స్టోరీ ఏంటంటే?

జిగ్రా మూవీని వాసన్ బాలా డైరెక్ట్ చేయగా.. ఆలియా భట్ లీడ్ రోల్లో నటించింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అక్టోబర్ 11న దసరా సందర్భంగా రిలీజైంది. తన తమ్ముడిని జైలుకు వెళ్లకుండా కాపాడుకునే సత్య అనే ఓ అక్క పాత్రలో ఆలియా ఈ సినిమాలో నటించింది. తన తమ్ముడిని డ్రగ్స్ కేసులో అన్యాయంగా ఇరికించారంటూ ఓ అక్క అతన్ని విడిపించడానికి ఓ పెద్ద సాహసమే చేస్తుంది.

న్యాయస్థానంలో తమకు న్యాయం దక్కకపోవడంతో సత్య మరో ఇద్దరితో కలిసి తన తమ్ముడితోపాటు మరో ముగ్గురిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అతనికి మరణ శిక్ష విధించడానికి మరో మూడు నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ఆమె అతన్ని కాపాడుకుంటుందా? తన పోరాటంలో విజయం సాధిస్తుందా లేదా అన్నదే ఈ జిగ్రా మూవీ స్టోరీ.

ఈ సినిమాకు క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఎక్కువ రోజులు మూవీ నిలబడలేకపోయింది. ఇప్పుడు సుమారు రెండు నెలల తర్వాత ఈ జిగ్రా మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఈ సినిమాకు ఎంత మేర ఆదరణ లభిస్తుందో చూడాలి.

Whats_app_banner