Project z OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ - ట్విస్ట్‌లకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Project Z OTT: సందీప్‌కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. మే 31 నుంచి ఆహా ఓటీటీలో ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Project Z OTT: సందీప్‌కిషన్ హీరోగా నటించిన ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో మే 31 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రాజెక్ట్ జెడ్ రిలీజ్ డేట్‌ను ఆహా ఓటీటీ అధికారికంగా వెల్లడించింది.
జాకీ ష్రాఫ్ విలన్...
ప్రాజెక్ట్ జెడ్ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ విలన్ పాత్రను పోషించాడు. ఈ సినిమాకు సీవీ కుమార్ దర్శకత్వం వహించాడు.
మాయవన్‌కు డబ్ వెర్షన్...
తమిళ మూవీ మాయవన్‌కు డబ్ వెర్షన్ ప్రాజెక్ట్ జెడ్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మాయవన్ 2017లోనే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు నిర్మాతతో సందీప్‌కిషన్‌కు ఏర్పడిన విభేదాల ప్రాజెక్ట్‌జెడ్ మాత్రం ఏడేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజైంది. తమిళంలో మాయవన్ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. హీరోగా సందీప్‌కిషన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా కాన్సెప్ట్‌తో పాటు ట్విస్ట్‌లు, సందీప్‌కిషన్, జాకీ ష్రాఫ్ యాక్టింగ్ బాగుందంటూ ప్రశంసలు దక్కాయి.
ప్రాజెక్ట్ జెడ్ కథ ఇదే...
కుమార్ (సందీప్‌కిషన్) ఓ పోలీస్ ఆఫీసర్. ఓ హంతకుడిని పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడతాడు. ఈ ప్రమాదం నుంచి కోలుకున్న కుమార్‌కు ఓ ఛాలెంజింగ్ కేసును డీల్ చేసే బాధ్యతను పై అధికారులు అప్పగిస్తారు. సినిమా నటి విస్మతో పాటు మేకప్ మేన్ గోపి హత్యకు గురవుతారు. ఈ మర్డర్స్ వెనకున్న మిస్టరీని ఛేదించేలోపు అదే తరహాలో సిటీలో మరికొన్ని హత్యలు జరుగుతుంటాయి.
ఈ వరుస మర్డర్స్ వెనకున్న సీక్రెట్‌ను కుమార్ ఎలా ఛేదించాడు? న్యూరాలజీలో ఉన్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో మనిషి మెదడును మరో మనిషిలోకి కాపీ చేసే ఓ సైంటిస్ట్ ప్రయోగం కారణంగా ఎలాంటి విధ్వంసం జరిగింది. ఈ ప్రయోగం కారణంగా కిల్లర్‌గా మారిన ఆర్మీ మేజర్ సత్యన్(జాకీ ష్రాఫ్)ను కుమార్ ఎలా అడ్డుకున్నాడు? కుమార్‌ను ప్రేమించిన అదిర (లావణ్య త్రిపాఠి) ఎవరు? కుమార్ లక్ష్యానికి ఆమె ఎలా అండగా నిలిచింది అన్నదే ఈ మూవీ కథ.
మాయవన్‌కు సీక్వెల్...
ప్రాజెక్ట్ జెడ్ సినిమాలో మైమ్ గోపి, డేనియల్ బాలాజీ, జయప్రకాష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు జీబ్రాన్ మ్యూజిక్ అందించాడు. మాయవన్ మూవీకి ప్రస్తుతం మాయవన్ 2 పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది.
తెలుగు, తమిళ భాషల్లో బిజీ...
రిజల్ట్‌తో సంబంధం లేకుండా తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తోన్నాడు సందీప్‌కిషన్. ఈ ఏడాది ఊరు పేరు భైరవకోన మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హారర్ ఫాంటసీ కథతో తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది.
ప్రస్తుత తెలుగులో ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో ఓ యాక్షన్ కామెడీ మూవీ చేస్తోన్నాడు సందీప్‌కిషన్. తమిళంలో ధనుష్ రాయన్‌లో సందీప్‌కిషన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మాయవన్ సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు డిస్కషన్స్‌లో ఉన్నట్లు సమాచారం.