Ramanna Youth OTT: ఓటీటీలోకి టాలీవుడ్ కమెడియన్ పొలిటికల్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ramanna Youth OTT: పెళ్లిచూపులతో ఫేమ్ అభయ్ బేతిగంటి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రామన్న యూత్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. మే 30 నుంచి ఈ టీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Ramanna Youth OTT: పెళ్లిచూపులు ఫేమ్ అభయ్ బేతిగంటి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రామన్న యూత్ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో మే 30 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. రామన్న యూత్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో రామన్న యూత్ మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది.
పొలిటికల్ సెటైర్స్...
పొలిటికల్ సెటైర్ కాన్సెప్ట్‌తో అభయ్ బేతిగంటి రామన్న యూత్ మూవీని తెరకెక్కించాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో అమూల్యరెడ్డి, తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, అనీల్ గీలా ప్రధాన పాత్రలు పోషించారు.
రామన్న యూత్ కథ ఇదే...
రాజు (అభయ్ బేతిగంటి) స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. పొలిటికల్ లీడర్ కావాలన్నది అతడి కల. ఓ మీటింగ్‌లో రాజును అప్యాయంగా పలకరిస్తాడు సిద్ధిపేట ఎమ్మెల్యే రామన్న. ఎమ్మెల్యే మాటలతో రాజు పొంగిపోతాడు.
తనతో పాటు తన తండ్రి గురించి ఎమ్మెల్యేకు బాగా తెలుసునని రాజు భ్రమపడతాడు. ఎమ్మెల్యేపై అభిమానంతో అతడి పేరు మీద రామన్న యూత్ అసోసియేషన్‌ను ఏర్పాటుచేస్తాడు. ఊరిలో దసరా పండుగ సందర్భంగా పెద్ద ఫ్లెక్సీ పెట్టిస్తాడు రాజు. ఆ ఫ్లెక్సీ సాఫీగా సాగిపోతున్న రాజు జీవితంలో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించింది.
రాజుపై ఊరి సర్పంచ్ (తాగుబోతు రమేష్) తమ్ముడు మహిపాల్ (టాక్సీవాలా విష్ణు) ఎందుకు ద్వేషాన్ని పంచుకున్నాడు? సర్పంచ్ అండ లేకుండా డైరెక్ట్‌గా ఎమ్మెల్యేను కలుస్తానని మహిపాల్‌తో ఛాలెంజ్ చేసిన రాజు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా? ఎమ్మెల్యేను కలవడం కోసం హైదరాబాద్ వచ్చిన రాజు ఎందుకు జైలుపాలయ్యాడు? స్వప్న( అమూల్యరెడ్డి)ను ప్రేమించిన రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నదే రామన్న యూత్ కథ.
పల్లెటూరి రాజకీయాలు...
ఈ పొలిటికల్ మూవీని సీరియస్‌గా కాకుండా ఫన్ జోడించి తెరకెక్కించాడు అభయ్ బేతిగంటి. పల్లెటూళ్లలో రాజకీయాలు ఎలా ఉంటాయి? తమ స్వార్థం కోసం యువతను నాయకులు ఎలా వాడుకుంటున్నారు? నాయకుల మాటలు, మాయలో పడి యువతరం తమ జీవితాల్ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారన్నది వినోదాత్మకంగా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు.
కాన్సెప్ట్ బాగున్నా సరైన ప్రమోషన్స్ లేకపోవడం, రిలీజ్ ఆలస్యం కావడంతో థియేటర్లలో రామన్న యూత్ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలోని డైలాగ్స్‌ను కంప్లీట్‌గా తెలంగాణ యాసలోనే దర్శకుడు అభయ్ బేతిగంటి రాసుకున్నాడు.
పెళ్లిచూపులుతో ఫేమస్
బొమ్మలరామారాం సినిమాతో నటుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అభయ్ బేతిగంటి. విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లిచూపులు మూవీలో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు.
ఈ మూవీతో కమెడియన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అభయ్ సమ్మోహనం, గీతగోవిందం, సాహో, జార్జిరెడ్డి, రాక్షసకావ్యంతో పాటు పలు సినిమాలు చేశాడు. పిట్టకథలు, లూజర్‌తో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లలో అభయ్ బేతిగంటి సీరియస్ రోల్స్ చేశాడు.
టాపిక్