Jai Hanuman Movie: పుష్ప మేకర్స్‌తో ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’.. ఫస్ట్ లుక్ రిలీజ్‍కు డేట్ ఖరారు.. ఆ ఉత్కంఠ వీడనుందా?
Jai Hanuman Movie First look date: జై హనుమాన్ సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అప్‍డేట్ ఇచ్చారు. ఈ మూవీని ఏ బ్యానర్ ప్రొడ్యూజ్ చేయనుందో వెల్లడించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్‍కు డేట్‍ను కూడా ప్రకటించారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ (హను-మాన్) చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజైన ఈ సూపర్ హీరో చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో బంపర్ కలెక్షన్లు సాధించింది. రూ.350కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ రానుంది. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి విపరీతంగా ఉంది. ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఎట్టకేలకు జై హనుమాన్ అప్‍డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ.
పుష్ప నిర్మాతలతో..
హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించారు. అయితే, సీక్వెల్ మూవీ కోసం ప్రొడక్షన్ హౌస్ మారింది. జై హనుమాన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని ప్రశాంత్ వర్మ నేడు (అక్టోబర్ 29) వెల్లడించారు. ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. పుష్ప, పుష్ప 2 లాంటి భారీ చిత్రాలను ప్రొడ్యూజ్ చేసిన నవీన్ యెర్నేని, రవిశంకర్.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై జై హనుమాన్‍ను నిర్మించనున్నారు. కాగా, హనుమాన్ మూవీని ఈ ప్రొడక్షన్ హౌసే డిస్ట్రిబ్యూట్ చేసింది.
ఫస్ట్ లుక్ డేట్ ఇదే
జై హనుమాన్ చిత్రం నుంచి రేపు (అక్టోబర్ 30) ఫస్ట్ లుక్ రివీల్ కానుంది. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. దీపావళి పండుగ ముందు ఈ చిత్రం నుంచి అక్టోబర్ 30న ఫస్ట్ లుక్ వచ్చేయనుంది. హనుమంతుడు గుడిలోకి నడుచుకుంటూ వెళుతున్నట్టుగా ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఫస్ట్ లుక్ డేట్‍ను కన్ఫర్మ్ చేశారు ప్రశాంత్ వర్మ.
ఆ ఉత్కంఠ వీడనుందా?
జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడిగా ఎవరు నటిస్తారనే ఉత్కంఠ చాలా కాలంగా సాగుతోంది. ఇప్పటికే చాలా మంది తెలుగు హీరోల పేర్లు వినిపించాయి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి.. హనుమంతుడిగా నటించనున్నారని ఇటీవల రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే, రేపు (అక్టోబర్ 30) రానున్న ఫస్ట్ లుక్ ద్వారా ఈ ఉత్కంఠ వీడే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేయనున్నారో వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఈ ఫస్ట్ లుక్‍పై విపరీతమైన ఆసక్తి నెలకొంది.
హనుమాన్ గురించి..
హనుమాన్ చిత్రం కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‍తో రూపొంది రూ.350 కోట్ల వరకు కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సూపర్ హీరో మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తీరు, హనుమంతుడిని చూపించిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎండింగ్‍తో సీక్వెల్‍పై కూడా ఆసక్తి పెరిగిపోయింది. హనుమాన్ చిత్రం ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్లను దక్కించుకుంది. పెద్ద చిత్రాలు పోటీలో ఉన్నా.. అన్నింటిని అధిగమించి ఈ మూవీ విజేతగా నిలిచింది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ వసూళ్లు సాధించి.. పాన్ ఇండియా రేంజ్ హిట్ అయింది. ప్రశాంత్ వర్మ పాపులర్ అయ్యారు. హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించారు. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, సముద్రఖని, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. జై హనుమాన్ చిత్రంలో నటీనటులు ఎవరు ఉంటారో చూడాలి.