Prabhas As Lord Shiva : మంచు ఫ్యామిలీ సినిమాలో ప్రభాస్.. మహాశివుడిగా డార్లింగ్-prabhas will act as lord shiva in manchu vishnu kannappa movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas As Lord Shiva : మంచు ఫ్యామిలీ సినిమాలో ప్రభాస్.. మహాశివుడిగా డార్లింగ్

Prabhas As Lord Shiva : మంచు ఫ్యామిలీ సినిమాలో ప్రభాస్.. మహాశివుడిగా డార్లింగ్

Anand Sai HT Telugu
Sep 10, 2023 10:51 AM IST

Prabhas With Manchu Family : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప సినిమా గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ విషయం బయటకు వచ్చింది. ప్రభాస్ ఈ చిత్రంలో నటిస్తున్నాడని తెలుస్తోంది.

ప్రభాస్, విష్ణు
ప్రభాస్, విష్ణు (twitter)

మంచు విష్ణు కన్నప్ప(Manchu Vishnu Kannappa) సినిమా గురించి భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కూడా కనిపించనున్నాడు. మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. దీంతో బజ్ క్రియేట్ అయింది. ప్రభాస్(Prabhas) కూడా ఈ సినిమాలో నటిస్తున్నడని తెలిసి.. కన్నప్ప సినిమా(Kannappa) గురించి ట్రెండ్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ నటులు కూడా ఉంటారని సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తు్న్నారు.

ఇప్పటికే మోహన్ బాబు.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో కీలక కామెంట్స్ చేశారు. భారీ బడ్జెట్‍తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు.. ఎవరూ ఊహించని వారంతా సినిమాలో నటిస్తారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తోంది. ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ ఈ చిత్రంలో నటించే అవకాశం ఉంది.

ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా న్యూజిలాండ్‍లోనే ప్లాన్ చేశారని తెలుస్తోంది. సినిమాకు తగ్గ వాతావరణ పరిస్థితులు అక్కడే ఉంటాయని చెబుతున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నప్ప సినిమాకు ప్రభాస్ ఇమేజీ చాలా లాభం చేకూరుస్తుందని మంచు ఫ్యామిలీ అనుకుంటుంది.

కన్నప్ప ప్రాజెక్టులో ప్రభాస్ నటిస్తున్నాడనంతో ఒక్కసారి సినిమా పేరు ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ పాత్ర గురించి.. బయటకు రావడంతోనే బజ్ క్రియేట్ అయింది. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో(Prabhas as Lord Shiva) కనిపించనున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాలో రాముడిగా దర్శనమిచ్చాడు ప్రభాస్.

నిజానికి హాలీవుడ్ స్థాయిలో భక్త కన్నప్ప సినిమా తీయాలని మంచు విష్ణుకు బలమైన కోరిక ఉంది. అందుకే ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు. భక్త కన్నప్పగా దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సూపర్ హిట్ సినిమా అందించారు. ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు విష్ణు కన్నప్పుగా రానున్నాడు. ఇందులో కృష్ణం రాజు సోదరుడి కుమారుడు ప్రభాస్ శివుడి పాత్రలో నటించడం విశేషం. నిజానికి మంచు ఫ్యామిలీకి, ప్రభాస్‍కు మంచి రిలేషన్ ఉది. బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. అందుకే ఈ ప్రాజెక్టు కోసం ప్రభాస్‍ను మోహన్ బాబు అడగ్గానే ఒప్పుకున్నాడు.

అవా ఎంటర్ట్మైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్ బాబు కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నప్ప.. ఓ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్ అనేది ఉప శిర్షిక. ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగాయి. కొన్ని రోజుల కిందట శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలు చేసి సినిమాను ప్రారంభించారు. రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.

IPL_Entry_Point