Prabhas Ravan Dahan: రామ్‌లీల ఈవెంట్‌కు ప్రభాస్ రాకపై సందిగ్ధత.. వస్తాడా? రాడా?-prabhas may not come to ramlila ravan dahan event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Ravan Dahan: రామ్‌లీల ఈవెంట్‌కు ప్రభాస్ రాకపై సందిగ్ధత.. వస్తాడా? రాడా?

Prabhas Ravan Dahan: రామ్‌లీల ఈవెంట్‌కు ప్రభాస్ రాకపై సందిగ్ధత.. వస్తాడా? రాడా?

Maragani Govardhan HT Telugu
Sep 14, 2022 12:26 PM IST

Prabhas May bot Come Ravan Dahan Event: దసరా ఉత్సవాల సందర్భంగా వచ్చే నెలలో దిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగనున్న రావణ్ దహన కార్యక్రమానికి ప్రభాస్ రాకపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రభాస్
ప్రభాస్ (PTI)

Prabhas About Ramlila Event: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగనున్న దసరా ఉత్సవాలకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో మన డార్లింగ్ ముఖ్య అతిథిగా వచ్చి రావణ దహనం చేయాలని రామ్‌లీలా కమిటీ సభ్యులు కోరారు. అయితే ఈ ఉత్సవాలకు ప్రభాస్ హాజరయ్యేది అనుమానంగా మారింది. రామ్ లీల్ ఈవెంట్‌లో ప్రభాస్ హాజరుకాడని ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది.

తొలుత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్ ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రను పోషిస్తున్న మన డార్లింగ్.. దసరా ఉత్సవాల్లో రావణ దహన కార్యక్రమంలో పాల్గొంటే చిత్ర ప్రచారానికి కూడా ఉపయోగపడుతుందని భావించారు. దీంతో వచ్చేందుకు అంగీకరించారు. అయితే ప్రభాస్ పెదనాన్న, సీనియర్ నటులు కృష్ణంరాజు ఆకస్మిక మరణం కారణంగా ప్రభాస్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేదని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

రామ్‌లీలా మైదానంలో జరిగే వేడుకలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. అలాంటి వేడుకలకు ప్రభాస్‌ గెస్ట్‌ రావడం చాలా సంతోషంగా ఉందని లవకుశ రామ్‌లీలా కమిటీ చీఫ్‌ అర్జున్‌ కుమార్‌ అన్నారు. రానున్న ఆదిపురుష్‌ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తున్నాడని, రావణ దహనం చేయడానికి అతనికి మించిన వ్యక్తి ఇంకెవరు ఉంటారని ఆయన అనడం గమనార్హం. అక్టోబరు 5న దసరా ఉత్సవాలు జరగనున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు నవంబరు నుంచి ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ పాన్‌ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం