Bahubali Episode Part 2: ప్రభాస్-గోపీచంద్ హీరోయిన్ కోసం గొడవపడ్డారా? బాలయ్య ముందు నిజం ఒప్పేసుకున్న హీరోలు-prabhas and gopichand says in unstoppable show they were fight for heroine once ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Prabhas And Gopichand Says In Unstoppable Show They Were Fight For Heroine Once

Bahubali Episode Part 2: ప్రభాస్-గోపీచంద్ హీరోయిన్ కోసం గొడవపడ్డారా? బాలయ్య ముందు నిజం ఒప్పేసుకున్న హీరోలు

అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్-గోపీచంద్
అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్-గోపీచంద్

Bahubali Episode Part 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రభాస్-గోపీచంద్ పాల్గొన్నారు. బాలయ్య అడిగిన ప్రశ్నకు వీరిద్దరూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

Bahubali Episode Part 2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్2లో ఇటీవల ప్రభాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే. బాహుబలి ఎపిసోడ్‌గా ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఈ ఎపిసోడ్ పార్ట్ 2 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్‌కు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా హాజరయ్యారు. ఇద్దరూ కలిసి బాలయ్యతో సరదాగా కబుర్లు చెప్పారు. ఇందులో భాగంగా బాలకృష్ణ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఛమత్కారంగా సమాధానమిచ్చారు. 2008లో మీరిద్దరూ ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారని విన్నాం. ఇంతకీ ఎవరా నటి? అని బాలయ్య ప్రశ్నించగా.. అవునని గోపీచంద్ బదులిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

గోపీచంద్ ఆన్సర్‌కు ఇబ్బంది పడిన ప్రభాస్.. అతడి వైపు ఆశ్చర్యంగా చూశారు. "హీరోయిన్ కోసం గొడవ పడ్డాం సార్.. కానీ 2008లో కాదు 2004లో వర్షం సినిమాలో హీరోయిన్ త్రిష కోసం గొడవ పడ్డామని" బదులిచ్చాడు. గోపీచంద్ టైమింగ్‌కు ప్రభాస్ సంబరపడ్డారు. "మా వాడు సూపర్‌గా సమాధానమిచ్చాడు." అని అన్నారు. తనకు సినిమాలు చూడటం, లేదా షాపింగ్ చేయడం ఒంటరిగానే ఇష్టమనిస పక్కనున్న ఎవరున్నా నచ్చదని తెలిపారు. కాకపోతే ఈ సారికి నయనతార, తమన్నాను మాత్రం షాపింగ్‌కు తీసుకెళ్తానని జోక్ చేశారు. దీపక, సమంతా ఇద్దరిలో సముద్రలో పడిపోతే ఎవరిని కాపాడుతావు అంటూ బాలకృష్ణ ప్రభాస్‌ను ప్రశ్నించగా.. ప్రస్తుతం దీపికతో సినిమా చేస్తున్నా కాబట్టి.. ఆమెనే కాపాడుతానని బదులిచ్చాడు.

బాహుబలి తరర్వాత తనపై బాగా ఒత్తిడి పెరిగిందని ప్రభాస్ చెప్పారు. అంత పెద్ద హిట్ తర్వాత దేశమంతా నచ్చే సినిమా చేయాలనుకున్నానని, అది కమర్షియలా? లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నించాలా? అని తర్జనభర్జనలు పడినట్లు చెప్పారు. ఒకవేళ అలా చేస్తే ప్రేక్షకులు స్వీకరిస్తారా? అని కూడా ఆలోచించినట్లు చెప్పాడు. ప్రేక్షకులను అలరించడం కోసం కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. "ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని" అన్నారు. అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ.. "ప్రభాస్‌ ఒత్తిడిలో ఉన్నప్పుడు అతడు వేరే ప్రపంచంలో ఉంటాడు. ఎందుకు ఇంతలా ఒత్తిడి తీసుకుంటున్నాడని" అనిపిస్తుంది. అని తెలిపాడు.

ఈ షోలో ప్రభాస్ తన పెదనాన్న కృష్ణం రాజును గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం రెబల్ స్టార్ కృష్ణంరాజు స్పెషల్ ఏవీ చూసి ముగ్గురు ఎమోషనల్ అయ్యారు. కాసేపు మౌనం పాటించి నివాళి అర్పించారు. తను నటుడిగా మారేందుకు స్ఫూర్తే పెదనాన్న గారని, భక్త కన్నప్ప చూసి తాను నటుడిగా మారినట్లు నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ విషయాన్ని తన కజిన్ ప్రమోద్‌కే చెప్పినట్లు వివరించారు.