Ponniyin Selvan Collections: తగ్గేదే లే.. 300 కోట్ల క్లబ్‌లో పొన్నియిన్‌ సెల్వన్-ponniyin selvan collections crossed 300 crores worldwide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Ponniyin Selvan Collections Crossed 300 Crores Worldwide

Ponniyin Selvan Collections: తగ్గేదే లే.. 300 కోట్ల క్లబ్‌లో పొన్నియిన్‌ సెల్వన్

సంచలనం సృష్టిస్తున్న పొన్నియిన్ సెల్వన్ 1
సంచలనం సృష్టిస్తున్న పొన్నియిన్ సెల్వన్ 1

Ponniyin Selvan Collections: తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్‌ దగ్గర దూసుకెళ్తోంది పొన్నియిన్‌ సెల్వన్‌. ఈ సినిమా అప్పుడే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది.

Ponniyin Selvan Collections: మణిరత్నం మరోసారి మ్యాజిక్ చేస్తున్నాడు. ఈ లెజెండరీ డైరెక్టర్‌ ఈసారి బాక్సాఫీస్‌ కలెక్షన్ల దగ్గర కూడా తగ్గేదే లే అంటున్నాడు. అతని కలల ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ దూకుడు కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. కలెక్షన్ల పరంగా రిలీజైన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా పీఎస్‌ 1 సంచలన విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మూవీని మద్రాస్‌ టాకీస్‌తో కలిసి నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ కూడా శుక్రవారం (అక్టోబర్‌ 7) ఈ కలెక్షన్ల రికార్డు గురించి ట్వీట్‌ చేసింది. సరిహద్దులు లేని సక్సెస్‌.. ఇంత అద్భుతమైన రెస్పాన్స్‌కు కృతజ్ఞతలు అంటూ రూ.300 కోట్ల మార్క్‌ దాటిన న్యూస్‌ను వెల్లడించింది.

ఇప్పటి వరకూ తమిళ సినిమాల్లో కేవలం నాలుగు మాత్రమే రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించాయి. అందులో ఈ పొన్నియిన్‌ సెల్వన్‌ కూడా ఒకటి. ఇంతకుముందు శంకర్‌, రజనీకాంత్‌ మూవీ 2.0.. అట్లీ, విజయ్‌ మూవీ బిగిల్‌.. లోకేష్‌, కమల్‌ మూవీ విక్రమ్‌ కూడా రూ.300 కోట్లకుపైగా వసూలు చేశాయి. ఈ నాలుగు సినిమాల్లో రెండు 2022లోనే రిలీజ్‌ కావడం విశేషం.

కొన్ని నెలల కిందటే కమల్ హాసన్‌ మూవీ విక్రమ్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనం చూశాం. ఇక ఇప్పుడు పొన్నియిన్‌ సెల్వన్‌ కూడా అదే రేంజ్‌లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా తమిళ ప్రైడ్‌ అంటూ వచ్చిన ఈ సినిమా తమిళనాడులో ఊహించినట్లే ప్రభంజనం సృష్టిస్తోంది. ఇటు తెలుగులోనూ ఈ సినిమాకు తొలి రోజు నుంచి మిక్స్‌డ్‌ రియాక్షన్సే వచ్చినా.. కలెక్షన్లు మాత్రం బాగానే ఉండటం విశేషం.

అటు అమెరికాలోనూ పొన్నియిన్‌ సెల్వన్‌ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 47 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఈ వీకెండ్‌లో 50 లక్షల డాలర్ల మార్క్‌ అందుకోనుంది. దీంతో అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా నిలవనుంది. విక్రమ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిషలాంటి భారీ తారాగణం, రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన పొన్నియిన్‌ సెల్వన్‌ 1 అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.