Polimera 2 OTT Release Date: మా ఊరి పొలిమేర-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు: స్ట్రీమింగ్‍ వివరాలివే..-polimera 2 ott release date announced officially ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Polimera 2 Ott Release Date Announced Officially

Polimera 2 OTT Release Date: మా ఊరి పొలిమేర-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు: స్ట్రీమింగ్‍ వివరాలివే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 01, 2023 05:53 PM IST

Maa Oori Polimera 2 OTT Release Date: ‘మా ఊరి పొలిమేర-2’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. స్ట్రీమింగ్‍కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Polimera 2 OTT Release Date: మా ఊరి పొలిమేర-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు: స్ట్రీమింగ్‍ వివరాలివే..
Polimera 2 OTT Release Date: మా ఊరి పొలిమేర-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు: స్ట్రీమింగ్‍ వివరాలివే..

Maa Oori Polimera 2 OTT Release Date: సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో 2021లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయింది. చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఆ మూవీకి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ సినిమాకు సీక్వెల్‍గా ఇటీవలే ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. చిన్న చిత్రంగా వచ్చి మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

ట్రెండింగ్ వార్తలు

‘మా ఊరి పొలిమేర-2’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో డిసెంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ఆహా గోల్డ్ సబ్‍స్క్రిప్షన్ ఉన్నవారు 24 గంటల ముందుగానే అంటే డిసెంబర్ 7నే ఈ చిత్రాన్ని చూడొచ్చు.

“మెదడును మెలికలు తిప్పే, ఊహించని ట్విస్టులతో బ్లాక్‍బాస్టర్ పొలిమేర 2 ఆహాలో డిసెంబర్ 8న వచ్చేస్తోంది. ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు 24 గంటల ముందుగానే ఎర్లీ యాక్సెస్ ఉంటుంది” ఆహా ట్వీట్ చేసింది.

మా ఊరి పొలిమేర-2 చిత్రం కూడా చేతబడి, క్షుద్రపూజల చుట్టే తిరుగుతుంది. ఈ మూవీలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలాదిత్య, రవివర్మ, రాఖేందుమౌళి కీలకపాత్రలు పోషించారు.

పొలిమేర-2 సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‍ప్లే, డైలాగ్స్ కూడా అందించారు అనిల్ విశ్వనాథ్. ఈ సినిమాను గౌర్ కృష్ణ నిర్మించగా.. గ్యానీ సంగీతం అందించారు. కుషేందర్ రమేశ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేయగా.. శ్రీవర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

కాగా, 2021లో వచ్చిన 'మా ఊరి పొలిమేర' డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులో ఉంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.