Pawan Kalyan | యాక్షన్స్ సీక్వెన్స్ రిహార్సల్స్ లో పవన్...‘హరిహరవీరమల్లు’ కోసం సిద్ధం
‘హరిహరవీరమల్లు’ లో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం బల్గేరియన్ ఫైట్ మాస్టర్ వద్ద పవన్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
‘భీమ్లానాయక్’ తర్వాత షూటింగ్‌లకు చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. హరిహరవీరమల్లు షూటింగ్ మొదలుపెట్టనున్నారు. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. శుక్రవారం నుంచి ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభకానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించబోతున్నారు. వీటి కోసం బల్గేరియన్ స్టంట్ మాస్టర్ టోడోర్ లజరోవ్ వద్ద పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాటు హెల్ బాయ్ లాంటి హాలీవుడ్ చిత్రాలకు లజరోవ్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేవారు. లజరోవ్ తో కలిసి యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ రిహార్సల్ చేస్తున్న ఫొటోలను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకున్నది. ఈ ఫొటోల్లో విల్లు పట్టుకొని స్టైలిష్‌గా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. మొఘలుల కాలం నాటి కథతో దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.ఎమ్.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
టాపిక్