Pawan Kalayan Watched Waltair Veerayya song: అన్న బాస్‌ పాట చూసి మురిసిపోయిన పవన్‌ కల్యాణ్‌.. ఫొటో వైరల్-pawan kalayan watched waltair veerayya boss party song with chiranjeevi
Telugu News  /  Entertainment  /  Pawan Kalayan Watched Waltair Veerayya Boss Party Song With Chiranjeevi
వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ చూస్తున్న పవన్ కల్యాణ్, చిరంజీవి
వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ చూస్తున్న పవన్ కల్యాణ్, చిరంజీవి

Pawan Kalayan Watched Waltair Veerayya song: అన్న బాస్‌ పాట చూసి మురిసిపోయిన పవన్‌ కల్యాణ్‌.. ఫొటో వైరల్

22 November 2022, 19:04 ISTHT Telugu Desk
22 November 2022, 19:04 IST

Pawan Kalayan Watched Waltair Veerayya song: అన్న బాస్‌ పాట చూసి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ మురిసిపోయాడు. అన్న లుంగి ఎత్తి మాస్ పాటకు స్టెప్పులేస్తుంటే పవన్‌ చూస్తూ ముసిముసిగా నవ్వాడు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Pawan Kalayan Watched Waltair Veerayya song: మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త మంగళవారం (నవంబర్‌ 22) ఉదయమే వచ్చిన సంగతి తెలుసు కదా. చిరు నెక్ట్స్‌ మూవీ వాల్తేర్‌ వీరయ్య మూవీ నుంచి బాస్‌ పార్టీ సాంగ్‌ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాట బుధవారం (నవంబర్‌ 23) సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు అనౌన్స్‌ చేశారు.

అయితే ఈ ఫస్ట్‌ సింగిల్‌ను ఇప్పటికే చిరు తమ్ముడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చూసేశాడు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ప్రోమో చూస్తుంటేనే పక్కా మాస్‌ నంబర్‌గా కనిపిస్తోంది. దీనికి దేవిశ్రీప్రసాద్‌ వాయిస్‌, మ్యూజిక్ అందరితో స్టెప్పులేయించేలా ఉంది. అందుకేనేమో ఈ పాటను పవన్‌ ఆసక్తిగా చూస్తుంటే అతన్ని చూసి అన్న చిరంజీవి నవ్వుతూ కనిపించాడు.

ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఉదయం నుంచి ఈ పాట ప్రోమో సంచలనాలు సృష్టిస్తుంటే.. సాయంత్రానికి పవన్‌ ఈ పాటను చూస్తున్న ఫొటో వైరల్‌ అయింది. ఇంతకుమించిన ఫొటో మెగాభిమానులకు ఇంకేముంటుంది. ప్రోమోలో మొదట దేవీ శ్రీ ప్రసాద్‌ మాస్‌ లిరిక్స్‌ను పాడుతూ కనిపించగా.. చిరంజీవి మెల్లగా లుంగీ పైకి ఎత్తుతూ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టడం చూడొచ్చు.

ఈ పాట కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్‌, చిరంజీవితోపాటు ఈ ఫొటోలో వాల్తేర్‌ వీరయ్య డైరెక్టర్‌ బాబీ, హరిహర వీర మల్లు డైరెక్టర్‌ క్రిష్‌ కూడా ఉన్నారు. ఈ పాటను పవన్‌ చూస్తుంటే ఎలా ఉంది అని చిరు అడిగినట్లుగా ఫొటో చూస్తే తెలుస్తోంది. ఈ మధ్యే మెగాస్టార్‌ గాడ్‌ఫాదర్‌ మూవీ నుంచి వచ్చిన మాస్‌ నంబర్‌ కూడా సూపర్‌ హిట్‌ కాగా.. ఇప్పుడు వాల్తేర్‌ వీరయ్య పాట కూడా సంచలనాలు సృష్టిస్తుందని మేకర్స్‌ ఆశతో ఉన్నారు.