OTT Romantic Thriller: ఓటీటీలోకి వచ్చేసిన ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. రూ.100 కోట్ల బడ్జెట్.. రూ.12 కోట్ల కలెక్షన్-ott biggest flop movie ajay devgan romantic thriller auron mein kahan dum tha now streaming on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Thriller: ఓటీటీలోకి వచ్చేసిన ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. రూ.100 కోట్ల బడ్జెట్.. రూ.12 కోట్ల కలెక్షన్

OTT Romantic Thriller: ఓటీటీలోకి వచ్చేసిన ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. రూ.100 కోట్ల బడ్జెట్.. రూ.12 కోట్ల కలెక్షన్

Hari Prasad S HT Telugu
Sep 27, 2024 03:10 PM IST

OTT Biggest Flop Movie: ఓటీటీలోకి తాజాగా ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఇది. ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో తీస్తే.. కేవలం రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ మూవీని ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు.

ఓటీటీలోకి వచ్చేసిన ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. రూ.100 కోట్ల బడ్జెట్.. రూ.12 కోట్ల కలెక్షన్
ఓటీటీలోకి వచ్చేసిన ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ.. రూ.100 కోట్ల బడ్జెట్.. రూ.12 కోట్ల కలెక్షన్

OTT Biggest Flop Movie: ఓటీటీలోకి శుక్రవారం (సెప్టెంబర్ 27) కొన్ని సూపర్ హిట్ సినిమాలతోపాటు ఓ డిజాస్టర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ కూడా వచ్చింది. బాలీవుడ్‌తోపాటు అజయ్ దేవగన్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయిన ఈ సినిమా పేరు ఔరో మే కహా దమ్ థా. టబు కూడా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడగా.. ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఔరో మే కహా దమ్ థా ఓటీటీ స్ట్రీమింగ్

బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగన్, టబు నటించిన మూవీ ఔరో మే కహా దమ్ థా. ఆగస్ట్ 2వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఈ నెల 13వ తేదీనే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టినా.. రెండు వారాల పాటు రెంట్ విధానంలో మాత్రమే చూసే అవకాశం కల్పించారు.

అది కూడా ఏకంగా రూ.349 రెంట్ కావడంతో ఇన్నాళ్లూ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఇవాళ్టి నుంచి మూవీని ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ తోనే చూసేయొచ్చు. రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.12.4 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయంటే ఎంతటి డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. అజయ్ దేవగన్ కెరీర్లోని అతిపెద్ద డిజాస్టర్లలో ఇదీ ఒకటిగా నిలిచింది.

ఔరో మే కహా దమ్ థా మూవీ ఏంటి?

ఔరో మే కహా దమ్ థా మూవీలో అజయ్ దేవగన్, టబు నటించారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన పదో సినిమా కావడం విశేషం. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. నీరజ్ పాండే డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఓ జంట చుట్టూ తిరుగుతుంది. కృష్ణ (అజయ్ దేవగన్), వసుధ (టబు) లవ్ స్టోరీ ఏకంగా 23 ఏళ్ల పాటు సాగుతుంది.

పలు హత్య కేసుల్లో కృష్ణకు జైలు శిక్ష పడటంతో వసుధ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అయితే 22 ఏళ్ల తర్వాత కృష్ణకు క్షమాభిక్ష పెట్టడంతో అతడు జైలు నుంచి విడుదలవుతాడు. ఆ తర్వాత అతడు వసుధను కలుసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ల జీవితాల్లో ఏం జరగింది అన్నది ఈ ఔరో మే కహా దమ్ థా మూవీలో చూడొచ్చు.

అయితే ఈ సినిమాను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. భారీ బడ్జెట్ పెట్టి తీసినా.. తొలి రోజు అయిన ఆగస్ట్ 2న కేవలం రూ.1.85 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే లభించాయి. 2024లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. ఏకంగా రూ.148 కోట్ల నష్టాలు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇదే ఏడాది అజయ్ దేవగన్ కే చెందిన మైదాన్ కూడా భారీ నష్టాలను మిగిల్చిన విషయం తెలిసిందే.

Whats_app_banner