Operation Valentine Collections: ఆపరేషన్ వాలెంటైన్ కలెక్షన్స్ - 50 కోట్ల బడ్జెట్ మూవీకి ఫస్ట్ డే వచ్చింది ఎంతంటే?
Operation Valentine Collections: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద డీలాపడింది. ఈ దేశభక్తి మూవీకి వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే కోటి ఇరవై లక్షల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
Operation Valentine Collections: వరుణ్‌తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్ రాబట్టింది. యథార్థ ఘటనల స్ఫూర్తితో ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో జెట్ ఫైటర్ పాత్రలో వరుణ్ తేజ్ నటించాడు. ఈ ఎక్స్‌పీరిమెంట్ మూవీతో శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
తొలిరోజు వసూళ్లు ఇవే...
శుక్రవారం రిలీజైన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రెండున్నర కోట్లకుపైగా గ్రాస్‌ను, కోటి ఇరవై లక్షల వరకు షేర్‌ను రాబట్టినట్లు సమాచారం. సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో మాస్ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యే కాన్సెప్ట్ కాకపోవడంతోనే తొలిరోజు ఊహించిన స్థాయిలో ఆపరేషన్ వాలెంటైన్ మూవీ వసూళ్లను దక్కించుకోలేకపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
ఆపరేషన్ వాలెంటైన్ బడ్జెట్...
వరుణ్‌తేజ్ గత సినిమాల ఎఫెక్ట్ కూడా ఆపరేషన్ వాలెంటైన్ ఓపెనింగ్స్‌పై పడినట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తెరకెక్కింది. టీజర్స్, ట్రైలర్స్ కు మంచి బజ్ రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 17 కోట్ల వరకు జరిగింది. తొలిరోజు వసూళ్ల నేపథ్యంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సర్జికల్ స్ట్రైక్స్ స్ఫూర్తిగా...
ఈ దేశభక్తి సినిమాలో స్వాడ్రాన్ లీడర్‌గా వరుణ్‌తేజ్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కుతోన్నాయి. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కానీ దేశభక్తిని బలంగా చాటిచెప్పే ఎమోషన్స్ లేకపోవడం ఆపరేషన్ వాలెంటైన్‌కు మైనస్‌గా మారింది. ఇటీవల రిలీజైన హృతిక్ రోషన్ బాలీవుడ్ మూవీ ఫైటర్ కథకు ఆపరేషన్ వాలెంటైన్ స్టోరీలైన్ దగ్గరగా ఉండటం కూడా వరుణ్ తేజ్ సినిమాపై ఎఫెక్ట్‌ను చూపించింది.
ఆపరేషన్ వాలెంటైన్ కథ ఇదే...
అర్జున్ రుద్ర దేవ్ (వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రాన్ లీడర్‌గా పనిచేస్తుంటాడు. దేశం కోసం ప్రాణాలు లెక్కచేయకుండా రిస్క్‌లు తీసుకుంటాడు. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లో పుల్వమాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలభై మంది భారత సైనికులు కన్నుమూస్తారు.
పుల్వమా ఎటాక్‌పై రివేంజ్ తీర్చుకోవడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఈ సర్జికల్ స్ట్రైక్‌ను సక్సెస్ చేసే బాధ్యతను తీసుకున్న రుద్రదేవ్ ఉగ్రమూకలను ఎలా అంతం చేశాడు? బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఇండియాలో దాడులు చేసేందుకు పాకిస్థాన్ వేసిన ప్లాన్స్ ఏమిటి? రుద్రదేవ్ పాకిస్థాన్ పన్నాగాల్ని ఎలా తిప్పి కొట్టాడు అన్నదే ఈ మూవీ కథ.
బాలీవుడ్ ఎంట్రీ...
ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నవదీప్, అలీరెజా కీలక పాత్రలు పోషించారు. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తెలుగుతో పాటు బాలీవుడ్‌లోని రిలీజైంది. ఈ మూవీతోనే వరుణ్ తేజ్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆపరేషన్ వాలెంటైన్ తర్వాత మట్కా అనే సినిమా చేస్తోన్నాడు వరుణ్ తేజ్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు.