NTR | ఎన్టీఆర్‌-కొర‌టాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడంటే...-ntr to start shooting for koratala siva movie on june ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr | ఎన్టీఆర్‌-కొర‌టాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడంటే...

NTR | ఎన్టీఆర్‌-కొర‌టాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడంటే...

Nelki Naresh HT Telugu
Apr 18, 2022 12:33 PM IST

జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత హీరో ఎన్టీఆర్‌,ద‌ర్శ‌కులు కొర‌టాల శివ క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌లుకానుంద‌నే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ వెల్ల‌డించారు.

ఎన్టీఆర్‌
ఎన్టీఆర్‌ (twitter)

‘ఆర్ఆర్ఆర్ ’తో కెరీర్ లో పెద్ద స‌క్సెస్ అందుకున్నారు కథానాయకుడు ఎన్టీఆర్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మల్టీస్టారర్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వెయ్యి కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. స్టూడెంట్స్ పాలిటిక్స్ నేప‌థ్యంలో సామాజిక ఇతివృత్తానికి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను మేళ‌విస్తూ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ సినిమాను రూపొందించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ రోల్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా శ‌క్తివంతంగా ఉంటుంద‌ని స‌మాచారం. 

ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి సంబంధించి చాలా కాలంగా అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి.  ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు  చిత్ర నిర్మాతలు, దర్శకుడు ఎలాంటి అప్‌డేట్స్‌ వెల్లడించకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఎట్టకేలకు ఈ గాసిప్స్ కు పుల్‌స్టాప్ పెట్టారు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుతున్న‌ట్లు తెలిపారు.

 ఈ సినిమాలో క‌థానాయిక‌గా అలియాభ‌ట్ న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. త‌న‌ను చిత్ర యూనిట్ సంప్ర‌దించిన మాట వాస్త‌వ‌మేన‌ని అలియాభ‌ట్ చెప్పింది. ఇటీవ‌లే ర‌ణ‌భీర్‌తో అలియా పెళ్లి జ‌రిగింది. వివాహం కార‌ణంగా డేట్స్ స‌ర్ధుబాటు కాకపోవడంతో ఈ సినిమా నుంచి ఆమె త‌ప్పుకుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  అలియా న‌టిస్తుందా? లేదంటే ఆమె స్థానంలో మ‌రో హీరోయిన్ ను తీసుకుంటారా అనేది త్వ‌ర‌లోనే వెల్ల‌డికానున్న‌ట్లు స‌మాచారం. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్