Adhurs Re-release Date: 'అదుర్స్' రీ-రిలీజ్ డేట్ ఖరారు.. మళ్లీ వెండితెరపై చారి, భట్టూ సందడి-ntr starrer adhurs re release date announced officially ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adhurs Re-release Date: 'అదుర్స్' రీ-రిలీజ్ డేట్ ఖరారు.. మళ్లీ వెండితెరపై చారి, భట్టూ సందడి

Adhurs Re-release Date: 'అదుర్స్' రీ-రిలీజ్ డేట్ ఖరారు.. మళ్లీ వెండితెరపై చారి, భట్టూ సందడి

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 02, 2023 03:55 PM IST

Adhurs Re-release Date: అదుర్స్ సినిమా థియేటర్లలోకి మళ్లీ వచ్చేస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

అదుర్స్ పోస్టర్ (Photo: Twitter)
అదుర్స్ పోస్టర్ (Photo: Twitter)

Adhurs Re-release Date: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ చిత్రం సూపర్ హిట్ అయింది. 2010లో రిలీజైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అంతకన్నా మించి ఎవర్‌గ్రీన్ మూవీగా నిలిచిపోయింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయగా.. నరసింహాచారి (చారి) క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయింది. ఆ పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అదిరిపోయింది. భట్టాచార్య (భట్టూ) పాత్రలో బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించారు. చారి, భట్టూ కలిసి పండించిన కామెడీ హైలైట్‍గా నిలిచింది. ఇప్పటికీ ఈ మూవీని, కామెడీ సీన్లను చాలా మంది రీపీటెడ్‍గా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తుంటడటంతో అదుర్స్ సినిమా థియేటర్లలోకి మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. ఎట్టకేలకు అదుర్స్ మూవీ రీ-రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ అయింది.

నవంబర్ 18వ తేదీన అదుర్స్ మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు వచ్చింది. ఈ ఏడాది మార్చి 4నే అదుర్స్ రీ-రిలీజ్‍కు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, అప్పట్లో వాయిదా పడింది. దీంతో 4కే ఫార్మాట్‍లో నవంబర్ 18వ తేదీన అదుర్స్ మూవీని రీ-రిలీజ్ చేయనున్నట్టు ఇప్పుడు ప్రకటించారు.

2010 జనవరిలో అదుర్స్ సినిమా రిలీజ్ అయింది. ఎన్టీఆర్, బ్రహ్మానందం కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, పంచ్‍లు ఈ చిత్రంలో ప్రేక్షకులను బాగా అలరించాయి. కామెడీ బాగా పండింది. యాక్షన్ సీన్లు కూడా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో చారి, నరసింహ అనే రెండు క్యారెక్టర్స్ చేశారు ఎన్టీఆర్. నయనతార, శీల హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు మళ్లీ 13ఏళ్ల తర్వాత థియేటర్లలోకి రానుంది అదుర్స్.

అదుర్స్ చిత్రానికి కోన వెంకట్ కథ అందించగా.. వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. రమప్రభ, షాయాజీ షిండే, నాజర్, తనికెళ్ల భరణి, మహేశ్ మంజ్రేకర్, అషిశ్ విద్యార్థి కీలకపాత్రలు పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.