Telugu OTT: ఓటీటీలోకి నివేదా థామ‌స్ లేటెస్ట్ తెలుగు సూప‌ర్ హిట్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-nivetha thomas telugu comedy drama movie 35 chinna katha kaadu to premiere on aha ott from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Ott: ఓటీటీలోకి నివేదా థామ‌స్ లేటెస్ట్ తెలుగు సూప‌ర్ హిట్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Telugu OTT: ఓటీటీలోకి నివేదా థామ‌స్ లేటెస్ట్ తెలుగు సూప‌ర్ హిట్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 21, 2024 06:10 AM IST

Telugu OTT: నివేదా థామ‌స్ హీరోయిన్‌గా న‌టించిన 35 చిన్న క‌థ కాదు మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 27 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.చిన్న క‌థ‌కాదు సినిమాలో ప్రియ‌ద‌ర్శి, విశ్వ‌దేవ్ రాచకొండ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు

తెలుగు ఓటీటీ
తెలుగు ఓటీటీ

Telugu OTT: నివేదా థామ‌స్ హీరోయిన్‌గా న‌టించిన 35 చిన్న క‌థ కాదు మూవీ త్వ‌ర‌లో ఓటీటీలోకి రాబోతోంది. ఎమోష‌న‌ల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి నంద‌కిషోర్ ఇమాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో నివేధా థామ‌స్ తో పాటు ప్రియ‌ద‌ర్శి, విశ్వ‌దేవ్ రాచ‌కొండ, గౌత‌మి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీకి హీరో రానా ద‌గ్గుబాటి ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ఆహా ఓటీటీలో...

35 చిన్న క‌థ కాదు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యిన‌ట్లు స‌మాచారం. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ నెల 27 నుంచి ఆహా ఓటీటీలో ఈ కామెడీ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిసింది. మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం.

ఐదున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్‌...

35 చిన్న క‌థ‌కాదు మూవీలో న‌వ్విస్తూనే అంత‌ర్లీనంగా విద్యావ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఓ సందేశాన్ని ట‌చ్ చేశారు ద‌ర్శ‌కుడు నంద‌కిషోర్‌. ఈ సినిమాలో కొడుకు చ‌దువు కోసం ఆరాట‌ప‌డే త‌ల్లిగా నివేదా థామ‌స్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మౌత్‌టాక్‌తో ఈ సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచి నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

ఐదున్నర కోట్ల కలెక్షన్స్…

సెప్టెంబ‌ర్ 6న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు ఐదున్న‌ర కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను రెండు కోట్ల అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు షేర్‌ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న‌ది. రెండు కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రిలీజైన ప్రాఫిట్స్‌తో థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది. ముఖ్యంగా మ‌ల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను ఈ సినిమా ఎక్కువ‌గా మెప్పిస్తోంది.

35 మార్కుల కథ‌...

ప్ర‌సాద్ (విశ్వ‌దేవ్‌), స‌ర‌స్వ‌తి (నివేదా థామ‌స్‌) భార్యాభ‌ర్త‌లు. ప్ర‌సాద్ బ‌స్ కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తోండ‌గా...స‌ర‌స్వ‌తి గృహిణిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుంటుంది. వారి కొడుకు అరుణ్‌కు మ్యాథ్స్‌లో వెనుక‌బ‌డిపోతాడు. స్కూల్‌లో లెక్క‌ల‌కు సంబంధంచి తిక్క ప్ర‌శ్న‌ల‌తో టీచ‌ర్ల‌ను విసిగిస్తుంటాడు. అత‌డు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌రు. ఆరో త‌ర‌గ‌తిలో అరుణ్‌ను ఫెయిల్ చేస్తాడు టీచ‌ర్ చాణ‌క్య‌(ప్రియ‌ద‌ర్శి).

అరుణ్ స్కూల్‌లో ఉండాల‌నే మ్యాథ్స్‌లో 35 మార్కులు రావాల‌ని టీచ‌ర్లు కండీష‌న్ పెడ‌తారు. దాంతో కొడుకుకు మ్యాథ్స్ నేర్పించ‌డం కోసం స‌ర‌స్వ‌తి ఏం చేసింది? అరుణ్‌కు మ్యాథ్స్ ఎలా నేర్పించింది? అరుణ్ 35 మార్కులు తెచ్చుకున్నాడా? లేదా అనే అంశాల‌ను కామెడీ, ఎమోష‌న్స్ మేళ‌వించి ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో చూపించాడు. 35 చిన్న క‌థ కాదు సినిమాకు వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ అందించాడు.

రెండేళ్ల త‌ర్వాత‌...

35 చిన్న క‌థ కాదు మూవీతో దాదాపు రెండేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి నివేదా థామ‌స్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో గృహిణి పాత్ర కోసం ఆమె బ‌రువు పెరిగింది. తెలుగులో చివ‌ర‌గా 2022లో శాకిని డాకిని సినిమా చేసింది నివేదా థామ‌స్‌.

టాపిక్