Nithiin Vakkantham Vamsi Movie: మాస్ రోల్‌లో నితిన్ - మారేడుమిల్లిలో 32వ సినిమా షూటింగ్ షురూ-nithiin out and out mass avatar in vakkantham vamsi movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nithiin Out And Out Mass Avatar In Vakkantham Vamsi Movie

Nithiin Vakkantham Vamsi Movie: మాస్ రోల్‌లో నితిన్ - మారేడుమిల్లిలో 32వ సినిమా షూటింగ్ షురూ

Nelki Naresh Kumar HT Telugu
Nov 28, 2022 06:25 AM IST

Nithiin Vakkantham Vamsi Movie: నితిన్ 32వ సినిమా షూటింగ్ ఆదివారం మారేడుమిల్లిలో మొద‌లైంది. ఈ సినిమాలో నితిన్ గ‌డ్డంతో మాస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు.

నితిన్
నితిన్

Nithiin Vakkantham Vamsi Movie: కెరీర్‌లో ఎక్కువ‌గా ల‌వ‌ర్‌బాయ్ పాత్ర‌ల్లోనే క‌నిపించారు నితిన్‌. చాలా రోజుల త‌ర్వాత త‌న 32వ సినిమాలో ఔట్ అండ్ ఔస్ మాస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాకు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆదివారం నుంచి మారేడుమిల్లిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

నితిన్ మాస్ లుక్ ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. నితిన్ ముఖాన్ని కాకుండా బ్యాక్ లుక్ మాత్ర‌మే ఇందులో చూపించారు. ఈ సినిమాలో పొడ‌వైన గ‌డ్డం, మీసాల‌తో ర‌ఫ్ లుక్‌లో నితిన్ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మారేడుమిల్లిలో జ‌రిగే ఈ ఫ‌స్ట్‌ షెడ్యూల్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రేష్ట్ మూవీస్‌, ఆదిత్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ప‌తాకాల‌పై నితిన్ ఫాద‌ర్ సుధాక‌ర్‌రెడ్డి, సోద‌రి నిఖితారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.

ఏప్రిల్‌లో నితిన్ 32వ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. దాదాపు ఎనిమిది నెల‌ల విరామం త‌ర్వాత షూటింగ్ మొద‌లుపెట్ట‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒకానొక‌ద‌శ‌లో ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. షూటింగ్ మొద‌లుపెట్టి పుకార్ల‌కు పుల్‌స్టాప్ పెట్టారు చిత్ర‌యూనిట్‌.

ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాతో నితిన్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ప‌రాజ‌యం పాలైంది. ఈ సినిమా రిజ‌ల్ట్ త‌ర్వాత క‌థ‌ల విష‌యంలో నితిన్ జాగ్ర‌త్త వ‌హించిన‌ట్లు తెలిసింది. వ‌క్కంతం వంశీ స్టోరీపై రీ వ‌ర్క్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశాడు వ‌క్కంతం వంశీ. అత‌డు డైరెక్ష‌న్ చేస్తోన్న రెండో సినిమా ఇది.

IPL_Entry_Point