Nindu Noorella Saavasam November 25th Episode: భాగీ తాళిని దొంగలించిన నీల.. అమర్ సీరియస్, చిక్కుల్లో చిత్రగుప్తుడు-nindu noorella saavasam today episode of november 25th 2023 highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nindu Noorella Saavasam November 25th Episode: భాగీ తాళిని దొంగలించిన నీల.. అమర్ సీరియస్, చిక్కుల్లో చిత్రగుప్తుడు

Nindu Noorella Saavasam November 25th Episode: భాగీ తాళిని దొంగలించిన నీల.. అమర్ సీరియస్, చిక్కుల్లో చిత్రగుప్తుడు

Sanjiv Kumar HT Telugu
Nov 25, 2023 01:02 PM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ నవంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో భాగమతి బ్యాగ్‌లో ఉన్న తాళిని దొంగలిస్తుంది పనిమనిషి నీల. అది చిత్రగుప్తుడకి ఇవ్వడం అరుంధతి చూస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ నవంబర్ 25వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ నవంబర్ 25వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 25th November Episode: ఇల్లు క్లీన్ చేస్తున్న నీల చీపురు తగిలి మిస్సమ్మ బ్యాగ్ కింద పడిపోతుంది. అందులోంచి కిందపడిన తాళిబొట్టు చూసి ఆశ్చర్య పోతుంది. ఇదేంటి మిస్సమ్మ బ్యాగ్ లో తాళిబొట్టు ఉంది. ఆమెకి పెళ్లి అవ్వలేదు కదా. ఏంటో పెళ్లి కానీ మిస్సమ్మ తాళిబొట్టు పట్టుకొని తిరుగుతుంది. కాలికి మెట్టెలు ఉన్న మనోహరి అమ్మని పెళ్లయిందా అని అడిగితే కాలుతో తన్నింది అని నీల అనుకుంటుంది.

గాలిపటం లాగా

ఏంటో ఈ ఇంట్లో ఆడవాళ్లు. అయినా అందరి బ్రతుకులు బాగానే ఉన్నాయి. నీ బ్రతుకే దారం తెగిన గాలిపటం లాగా అయిపోయింది అనుకుంటూ ఆ తాళిని దొంగిలించి తనతో పాటు తీసుకువెళ్లిపోతుంది నీల. ఇంతలో ఎదురుగా వస్తున్న మనోహరిని చూసుకోకుండా గుద్దేస్తుంది. నీల చేతిలో ఉన్న తాళిబొట్టు జారీ కింద హాల్లో ఉన్న కృష్ణుడి బొమ్మ మీద పడుతుంది.

నీల తనని ఢీకొట్టడంతో కళ్లు కనిపించడం లేదా, అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటూ విసుక్కుంటుంది మనోహరి. కంగారుపడుతూ పొయ్యి పాలు మీద పెట్టాను పొంగిపోతాయేమో అని వెళ్తున్నాను అంటూ అక్కడ నుంచి కిందికి వెళుతుంది నీల. అప్పుడే లోపలికి వస్తున్న మిస్సమ్మని చూసి ఆ తాళి ఎక్కడ చూసేస్తుందో అని కంగారు పడిపోతుంది. కానీ మిస్సమ్మకి కూడా కనిపించకుండా తాళి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది నీల.

చెంగుచెంగున

నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకొని చెప్తున్నాను. ఆ మాంత్రికుడు కంటపడితే ప్రమాదం జాగ్రత్త పడు అని చెబుతాడు చిత్రగుప్తుడు. తలచుకుంటేనే భయంగా ఉంది నాకు గుర్తు చేయకండి. అయినా నా భయం నా కూతురు అర్థం చేసుకుంది అంటూ అరుంధతి ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి నీల పరిగెత్తుకుంటూ వస్తుంది. లేడి పిల్ల వలే చెంగుచెంగున పరిగెత్తుకుని వస్తున్నావు ఎందుకు అని అడుగుతాడు చిత్రగుప్తుడు.

నీకు ఒకటి చూపిస్తాను ఎవరికి చెప్పొద్దు అంటూ చేతిలో ఉన్న తాళిబొట్టు చూపిస్తుంది నీల. ఆ తాళిని గుర్తుపట్టి ఇది కొడైకెనాల్లో పోయిన నా తాళి నీ చేతికి ఎలా వచ్చింది అని కంగారుగా అడుగుతుంది అరుంధతి. అదే విషయాన్ని చిత్రగుప్తుడిని అడగమంటుంది. కానీ ఆమె మాటలు చిత్రగుప్తుడికి వినబడవు. ఈ మంగళ సూత్రము నాదే, ఇది మీ దగ్గరే జాగ్రత్తగా దాచండి. నా మెడలో పడవలసిన తాళి మీ చేతి నుంచి రావాలి కదా అని అతని చేతిలో పెట్టి వెళ్లిపోతుంది నీల.

సైలెంట్‌గా ఉండాలి

అరుంధతి ఎవరో తెలుసుకొని ఇంటికి వచ్చిన మంగళ వాళ్లు ఈరోజు మనం చూసిందంతా నిజమేనా అంటూ ఆశ్చర్యపోతారు. తనకి తెలియకుండానే భాగమతి తన అక్క పిల్లలకి సేవ చేస్తుంది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. తెలిసిందంటే భాగీ ఆ ఇంటి కోడలు అవుతుంది. భాగీ ఆ ఇంటి కోడలు అవ్వకూడదు అని కోరుకునే వాళ్లు మనకి దొరికే వరకు మనం సైలెంట్ గా ఉండాలి అనుకుంటారు.

స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న పిల్లలు రేపు సండే కదా వాచ్‌మెన్ తాతయ్య రేపు మా ఇంటికి లంచ్ కి రండి అని ఇన్వైట్ చేస్తారు. వద్దు పెద్ద వాళ్లకు తెలియకుండా ఇలా ఎవరిని పడితే వాళ్లని ఇంటికి ఇన్వైట్ చేయకూడదు అంటారు రామ్మూర్తి. మీరు ఇంటికి రాకపోతే మేము మీతో మాట్లాడం అంటూ రాథోడ్ వైపు తిరిగి రేపు తాతయ్య ఇంటికి వెళ్లి ఆయనని నువ్వే పిక్ చేసుకోవాలి అంటూ పురమాయిస్తుంది అమ్ము. అందుకు సరే అంటాడు రాథోడ్.

సీరియస్‌గా అమర్

వాచ్‌మెన్ అడ్రస్ చెప్తాడు. సరే అని అక్కడ నుంచి బయలుదేరుతారు రాథోడ్ వాళ్లు. అమావాస్య ఘడియలు దాటి పోవడంతో అరుంధతితో మాట్లాడుతాడు చిత్రగుప్తుడు. అప్పుడు అరుంధతి తన తాళి గురించి చెప్తుంది. ఆ తాళి ఆ బాలిక దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు ఉంటుంది. ఆ బాలిక అంటే ఎవరు అంటూ నిలదీస్తుంది అరుంధతి. చిత్రగుప్తుడు నిజం చెప్పలేక తడబడతాడు.

ఇంతలో సీరియస్ గా వస్తున్న అమరేంద్రని చూసి ఈయన ఏమిటి ఇంత సీరియస్ గా వస్తున్నారు అని చిత్రగుప్తుడిని అడుగుతుంది అరుంధతి. తన బ్యాగ్​లో తాళి పోయిందని మిస్సమ్మ తెలుసుకుంటుందా? అరుంధతికి జరిగింది యాక్సిడెంట్​ కాదని తెలుసుకున్న అమర్ ఏం చేస్తాడు? అనే విషయాలు తెలియాలంటే నవంబర్​ 27న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

IPL_Entry_Point