NNS Serial May 16th Episode: మిస్సమ్మకు అమర్ ముద్దు - అరుంధ‌తిని చంపిన‌ మ‌నోహ‌రి - స‌ర‌స్వతిని కాపాడిన రామ్మూర్తి-nindu noorella saavasam may 16th episode manohari fires on missamma nns today serial episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns Serial May 16th Episode: మిస్సమ్మకు అమర్ ముద్దు - అరుంధ‌తిని చంపిన‌ మ‌నోహ‌రి - స‌ర‌స్వతిని కాపాడిన రామ్మూర్తి

NNS Serial May 16th Episode: మిస్సమ్మకు అమర్ ముద్దు - అరుంధ‌తిని చంపిన‌ మ‌నోహ‌రి - స‌ర‌స్వతిని కాపాడిన రామ్మూర్తి

Nelki Naresh Kumar HT Telugu
May 16, 2024 12:39 PM IST

NNS Serial May 16th Episode: నేటి నిండు నూరేళ్ల సావాసం మే 16 నాటి ఎపిసోడ్‌లో యాక్సిడెంట్‌లో త‌న ప్రాణాలు తీసింది మ‌నోహ‌రి అని తెలిసి అరుంధ‌తి షాక‌వుతుంది. తాను న‌మ్మిన స్నేహితురాలే మోసం చేసింద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్
నిండు నూరేళ్ల సావాసం సీరియల్

NNS Serial May 16th Episode: కొడైకెనాల్ లో యాక్సిడెంట్ చేయించి తనని చంపింది తన ప్రాణస్నేహితురాలు మనోహరి అని తెలుసుకుని షాకవుతుంది అరుంధతి. వెంటనే ఉంగరం తీసి గుప్త చేతికి తొడిగి బాధపడుతూ కూర్చుంటుంది. చిన్నప్పటినుంచీ నమ్మిన స్నేహం మోసంగా మారిందా, తన ప్రాణానికి వెలకట్టిందా అని ఏడుస్తుంది.

మిస్స‌మ్మ క‌న్నీళ్లు....

అమర్​ నిద్రలేచేసరికి ఏడుస్తూ కూర్చుంటుంది మిస్సమ్మ. ఏమైందని అడిగిన అమర్​తో రాత్రి తన బతుకు సర్వనాశనం చేశారని, పొద్దంతా చిర్రుబుర్రులాడి రాత్రి మాత్రం తనని ఎందుకలా చేశారంటూ ఏడుస్తుంది. ఆ మాటలు విని షాకవుతాడు అమర్​. ఎట్టిపరిస్థితుల్లోనూ తను అలాంటి పని చేయనంటాడు. అన్నీ చేసి ఇప్పుడు ఇలా అంటారేంటి..

అమ‌ర్‌ను ఏడిపించిన మిస్స‌మ్మ‌...

మీరు ఇలాంటివాళ్లని అనుకోలేదు అంటూ మరింత ఏడుస్తుంది మిస్సమ్మ. నేను నీ మీద చెయ్యి వేయడం ఏంటి? అంటాడు అమర్​. రాత్రి చెయ్యి పట్టుకుని ఇప్పుడేమో చెయ్యి కూడా వేయలేదంటున్నారు నా బంగారు భవిష్యత్తుని బూడిదపాలు చేశారంటూ ఏడుస్తుంది మిస్సమ్మ.

అసలు రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోనివ్వు అంటున్న అమర్​తో గుర్తొచ్చిందా నన్నే విడమర్చి చెప్పమంటారా అంటుంది. లేదు.. నేను చెయ్యి వేసి ఉండను అంటాడు అమర్​. మీరు చెయేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటానా అని అమర్​ని ఆటపట్టిస్తుంది మిస్సమ్మ. లూజు.. ఏ విషయంలో జోక్​ చెయ్యాలో.. ఏ విషయంలో జోక్​ చెయ్యకూడదో తెలీదా అని అరుస్తాడు అమర్​.

మిస్స‌మ్మ‌కు అమ‌ర్ ముద్దు...

రాత్రితాను పాలు తాగడం, తర్వాత మిస్సమ్మని ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చి ఆ పాలు తాగాకే నాకు ఏదో అయ్యింది.. ఆ పాలల్లో నువ్వే కదా ఏదో కలిపింది అంటాడు అమర్​. మీకు మత్తు మందిచ్చే అవసరం నాకేంటి అంటుంది మిస్సమ్మ. ముసుగేసుకుని పెళ్లి చేసుకున్నావ్​, ఆ పాలల్లో ఏం కలిపి నన్నేం చేయాలనుకుంటున్నావో నాకేం తెలుసు అంటాడు అమర్​. కాళ్లమీద పడి ఇంకోసారి ఆ పీడకల గురించి మాట్లాడకండీ అని వేడుకుంటుంది మిస్సమ్మ.

అమ‌ర్ షాక్‌...

అమర్​ కోపంగా తలుపు తీస్తాడు. ఎదురుగా మనోహరి ఉండడం చూసి షాకవుతాడు. గుడ్​ మార్నింగ్​ అమర్​ అని అంతా ఓకేనా అంటుంది మనోహరి. ఈ పెళ్లి జరినప్పటినుంచీ అన్నీ బ్యాడ్ మార్నింగ్స్​ అంటూ కోపంతో రగిలిపోతాడు అమర్. దుప్పటి కప్పుకుని కూర్చుని ఏడుస్తున్న భాగీని చూసి రాత్రి అంతా జరిగిపోయినట్టుందని కంగారు పడుతుంది మనోహరి.

రాత్రి తనతో కమిట్​ అయ్యావా.. అసలు ఏం జరిగిందో చెప్పు అమర్ అని అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్​ మనోహరీ.. అలాంటిదేం లేదు తనని ముద్దు పెట్టుకున్నానట అదే చెబుతున్నా అంటాడు అమర్​. కోపంగా అమర్​ అక్కడ నుంచి వెళ్లడంతో రాత్రి ఏదో అయ్యిందని భయపడ్డావా? అసలు ఆ పాలల్లో ఏదో కలిపారని అనిపిస్తోంది నువ్వేమైనా కలిపావా మను.. అంటూ మనోహరిని ఏడిపిస్తుంది భాగీ.సరస్వతి మేడమ్​ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది.

రామ్మూర్తి సాయం...

ఊర్లో అందరూ సరస్వతి చుట్టూ చేరి లేపుతూ ఉంటారు. అటుగా వెళ్లిన రామ్మూర్తి ఎవరూ.. ఏమైంది? అని ఆమె దగ్గరకు వెళ్తాడు. ఇంకా హాస్పిటల్​ తీయకపోవడంతో తన ఇంటికి తీసుకెళ్తానంటాడు రామ్మూర్తి. అందరూ సాయం చేసి సరస్వతిని రామ్మూర్తి ఇంట్లో పడుకోబెడతారు. సరస్వతి తన దగ్గరనుంచి తప్పించుకుందని మనోహరికి ఫోన్​ చేసి చెబుతాడు డ్రైవర్​. ఆమెని ఓ ముఠా కాపాడిందని చెబుతాడు. వాళ్ల ఆనవాలు అడిగి తనకోసం వెతుకుతూ వచ్చినవాళ్లే సరస్వతిని కాపాడారని తెలుసుకుని షాకవుతుంది మనోహరి.

మంగ‌ళ ఫైర్‌....

సరస్వతిని ఇంటికి తీసుకురావడం చూసి ఆమె ఎవరు, ఎందుకు తీసుకువచ్చారని కోప్పడుతుంది మంగళ. ఆమెకి ఆరోగ్యం బాలేదని చెబుతాడు రామ్మూర్తి. ఏవరో వచ్చారని చూడటానికి వెళ్తుంది మనోహరి. మంచం మీద పడుకుని ఉన్న సరస్వతిని చూసి షాకవుతుంది. సమయానికి అమర్​ ఇంట్లో లేకపోవడంతో త్వరగా ఏదో ఒకటి చేసి ఆమెను ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్లాలని ప్లాన్​ చేస్తుంది. సరస్వతి మంగళను గుర్తుపట్టనుందా? మనోహరి నిజస్వరూపం బయటపడనుందా? అనే విషయాలు తెలియాలంటే మే 16న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ చూడాల్సిందే!