Kabzaa Fake Collections: ఫేక్ క‌లెక్ష‌న్స్‌లో క‌బ్జ... బాలీవుడ్‌ను మించిపోయింది - ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు-netizens trolls on kabzaa fake collections
Telugu News  /  Entertainment  /  Netizens Trolls On Kabzaa Fake Collections
క‌బ్జ మూవీ
క‌బ్జ మూవీ

Kabzaa Fake Collections: ఫేక్ క‌లెక్ష‌న్స్‌లో క‌బ్జ... బాలీవుడ్‌ను మించిపోయింది - ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు

20 March 2023, 12:26 ISTNelki Naresh Kumar
20 March 2023, 12:26 IST

Kabzaa Fake Collections: ఉపేంద్ర హీరోగా న‌టించిన క‌బ్జ సినిమాకు రెండు రోజుల్లోనే వంద కోట్లు వ‌చ్చాయంటూ చిత్ర యూనిట్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు.

Kabzaa Fake Collections: ఉపేంద్ర క‌బ్జ సినిమా ఫేక్ క‌లెక్ష‌న్ల వ్య‌వ‌హారం ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో హాట్‌టాపిక్‌గా మారింది. గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా మార్చి 17న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో రిలీజైంది. ఈ సినిమాకు ఆర్ చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

రిలీజ్ రోజు నుంచే క‌బ్జ సినిమా క‌థ‌, యాక్ష‌న్ సీన్స్ కేజీఎఫ్ సినిమాను పోలి ఉండ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొస్తున్నాయి. రొటీన్ గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా క‌న్న‌డంతో పాటు మిగిలిన భాష‌ల్లో తొలిరోజు 13 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. రెండోరోజు అటు ఇటుగా 7 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా అన్ని భాష‌ల్లో క‌లిపి 20 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌గా చిత్ర యూనిట్ మాత్రం 100 కోట్లు వ‌చ్చాయంటూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ను నిర్వ‌హించింది. వాస్త‌వంగా వ‌చ్చిన క‌లెక్ష‌న్స్‌కు ఐదింత‌లు ఎక్కువ చేసి చెప్ప‌డంపై సోష‌ల్ మీడియాలో క‌బ్జ యూనిట్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. ఫేక్ క‌లెక్ష‌న్స్ తో సినిమాను హిట్ చేయ‌లేరంటూ కామెంట్స్ చేస్తోన్నారు.

ఫేక్ క‌లెక్ష‌న్స్‌లో బాలీవుడ్‌ను క‌న్న‌డ ఇండ‌స్ట్రీ మించిపోయిందంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. బాలీవుడ్ వ‌చ్చిన క‌లెక్ష‌న్స్‌కు 30 ప‌ర్సెంట్ ఎక్కువ చేసి చెబితే క‌బ్జ ప్రొడ్యూస‌ర్ మాత్రం 300 శాతం ఎక్కువ చేసి చెప్పాడంటూ ఫ‌న్నీగా కామెంట్ చేశాడు. ఫేక్ క‌లెక్ష‌న్స్‌తో సినిమాను హిట్ చేయ‌లేర‌ని మ‌రో ప్రొడ్యూస‌ర్ అన్నాడు. క‌బ్జ సినిమాలో క‌న్న‌డ అగ్ర హీరోలు శివ‌రాజ్‌కుమార్‌, సుదీప్ గెస్ట్ పాత్ర‌ల్లో న‌టించారు. శ్రియ హీరోయిన్‌గా న‌టించింది.

టాపిక్