Dj Tillu 2 OTT Rights: డీజే టిల్లునా...మ‌జాకా - రికార్డు ధ‌ర‌కు అమ్ముడు పోయిన సీక్వెల్‌ ఓటీటీ రైట్స్‌-netflix acquired siddu jonnalagadda anupama parameswaran dj tillu square ott rights for record price ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dj Tillu 2 Ott Rights: డీజే టిల్లునా...మ‌జాకా - రికార్డు ధ‌ర‌కు అమ్ముడు పోయిన సీక్వెల్‌ ఓటీటీ రైట్స్‌

Dj Tillu 2 OTT Rights: డీజే టిల్లునా...మ‌జాకా - రికార్డు ధ‌ర‌కు అమ్ముడు పోయిన సీక్వెల్‌ ఓటీటీ రైట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 20, 2024 10:18 AM IST

Dj Tillu Square OTT Rights: డీజే టిల్లు స్వ్కేర్ ఓటీటీ రైట్స్ రికార్డ్ ధ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. థియేట్రిక‌ల్ రిలీజ్‌కు నెల రోజుల ముందే ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను 35 కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది.

డీజే టిల్లు స్వ్కేర్
డీజే టిల్లు స్వ్కేర్

Dj Tillu Square OTT Rights: ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో అత్యంత క్రేజ్ నెల‌కొన్న సీక్వెల్స్‌లో డీజే టిల్లు స్వ్కేర్ ఒక‌టి. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ మార్చి 29న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.రిలీజ్‌కు నెల‌న్న‌ర ముందే డీజే టిల్లు స్వ్కేర్ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ట్రైల‌ర్‌కు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. కంప్లీట్ బోల్డ్ రోల్‌లో ఫ‌స్ట్ టైమ్ అనుప‌మ ద‌ర్శ‌న‌మిచ్చి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. లిప్‌లాక్‌లు, రొమాంటిక్ డైలాగ్స్‌తో యూత్ ఆడియెన్స్‌ను ఈ ట్రైల‌ర్ అట్రాక్ట్ చేసింది. ఈ ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాలో నాలుగు మిలియ‌న్ల కుపైగా వ్యూస్ వ‌చ్చాయి.

ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్‌...

డీజే టిల్లు స్వ్కేర్ ట్రైల‌ర్‌తో ఈ సినిమా ప్రీ రిలీజ్‌, ఓటీటీ రైట్స్ కోసం చాలా డిమాండ్ ఏర్ప‌డిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సోనీలివ్ పోటీప‌డ్డ‌ట్లు స‌మాచారం. పోటీ మ‌ధ్య నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను దాదాపు 35 కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ కొనుగులు చేసిన‌ట్లు చెబుతోన్నారు.

తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు తెలిసింది. ఓటీటీ హ‌క్కుల విష‌యంలో ప‌లువురు టాలీవుడ్‌ మిడ్‌రేంజ్ హీరోల రికార్డును డీజే టిల్లు స్వ్కేర్ బ్రేక్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. డీజే టిల్లు సీక్వెల్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు ఫుల్ డిమాండ్ నెల‌కొన్న‌ట్లు చెబోతోన్నారు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే మూవీస్‌లో ఒక‌టిగా డీజే టిల్లు స్వ్కేర్ నిల‌బోతున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ కావాల్సింది కానీ....

డిజే టిల్లు స్క్వేర్ మూవీని తొలుత ఫిబ్ర‌వ‌రి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌ని నిర్మాత‌లు భావించారు. కానీ సంక్రాంతి ఒప్పుందాల కార‌ణంగా ఈ సినిమా వాయిదాప‌డింది. సంక్రాంతికి రావాల్సిన ర‌వితేజ ఈగ‌ల్ ఫిబ్ర‌వ‌రి 9వ తేదీకి మార‌డంతో ఆ సినిమా కోసం డీజే టిల్లు స్క్వేర్‌ను ఫిబ్ర‌వ‌రి 9 నుంచి మార్చి 29కి రి వాయిదావేశారు. ఈ సీక్వెల్‌కు మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సీక్వెల్‌కు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ క‌థ‌ను అందించ‌డం గ‌మ‌నార్హం.

2022లో రిలీజైన డీజే టిల్లు మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. దాదాపు ఎనిమిది కోట్ల బ‌డ్జెట్‌తో చిన్న సినిమాగా తెర‌కెక్కిన ఈ మూవీ 30 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. డీజే టిల్లు సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. రాధిక పాత్రలో నేహా శెట్టి న‌ట‌న‌కు యూత్ ఆడియెన్స్ తెగ క‌నెక్ట్ అయ్యారు. సీక్వెల్‌లో మాత్రం నేహాశెట్టి స్థానంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. డీజే టిల్లుకు మూవీకి విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

డీజే టిల్లు స్వ్కేర్ మూవీని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్ఛ్యూన్ ఫోర్ స‌తాకాల‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ క‌లిసి త్రివిక్ర‌మ్ భార్య సాయిసౌజ‌న్య నిర్మిస్తోంది. ఈ సినిమాకు త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను అందిస్తున్నాడు.

IPL_Entry_Point

టాపిక్