Animal First Single: ఇన్ని లిప్‌లాక్‌లు అవ‌స‌ర‌మా - యానిమల్ ఫ‌స్ట్ సింగిల్‌పై నెటిజ‌న్ల కామెంట్స్‌-netizens trolls on ranbir kapoor rashmika mandanna animal first single ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal First Single: ఇన్ని లిప్‌లాక్‌లు అవ‌స‌ర‌మా - యానిమల్ ఫ‌స్ట్ సింగిల్‌పై నెటిజ‌న్ల కామెంట్స్‌

Animal First Single: ఇన్ని లిప్‌లాక్‌లు అవ‌స‌ర‌మా - యానిమల్ ఫ‌స్ట్ సింగిల్‌పై నెటిజ‌న్ల కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu
Published Oct 11, 2023 11:57 AM IST

Animal First Single:యానిమ‌ల్ మూవీ ఫ‌స్ట్ సింగిల్ బుధ‌వారం రిలీజైంది. ఈ పాటలో లిప్‌లాక్‌తో ర‌ణ్‌భీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న అద‌ర‌గొట్టారు. ఈ ఫ‌స్ట్ సింగిల్‌పై నెటిజ‌న్ల‌ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

ర‌ణ్‌భీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న
ర‌ణ్‌భీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న

Animal First Single: యానిమ‌ల్ మూవీ ఫ‌స్ట్ సింగిల్‌లో ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న లిప్‌లాక్‌ల‌తో అద‌ర‌గొట్టారు. తండ్రీకొడుకుల‌ అనుబంధం నేప‌థ్యంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌ను బుధ‌వారం రిలీజ్ చేశారు. ఈ పాట‌లో ర‌ణ్‌భీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న లిప్‌లాక్‌లు హాట్‌టాపిక్‌గా మారాయి. అమ్మాయి అంటూ సాగిన ఈ పాట‌ను లిప్‌లాక్‌తోనే మొద‌లైంది.

ఏం... గీత ఇలాంటిదేదైనా ఉంటే ముందే చెప్పాలిగా..ఇంత దూరం తీసుకొచ్చావు. ఈ అబ్బాయిని చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్నాం. ఏం చేశాడో చూడండి అంటూ ర‌ణ్‌భీర్‌క‌పూర్‌పై ర‌ష్మిక మంద‌న్న ఫ్యామిలీ ఫైర్ అయిన‌ట్లుగా చూపించారు. ర‌ణ్‌భీర్‌ను ఇంట్లో నుంచి గెంటేయ‌డానికి ర‌ష్మిక ఫ్యామిలీ ట్రై చేయ‌డం, వారి ప్లాన్స్‌ను అడ్డుకోవ‌డానికి ఇద్ద‌రు లిప్‌లాక్ పెట్టుకుంటున్న‌ట్లుగా చూపిస్తూ పాట‌ను మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత ఫ్లైట్ జ‌ర్నీలో ర‌ష్మిక , ర‌ణ్‌భీర్ ముద్దుల్లో మునిగిపోయిన‌ట్లుగా చూపించారు.

ఇద్ద‌రు పెళ్లి చేసుకున్న‌ట్లుగా చూపించి పాట‌ను ఎండ్ చేశారు. ఈ ఫ‌స్ట్ సింగిల్‌కు ర‌ణ్‌భీర్‌, ర‌ష్మిక కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది. ఈ పాట‌పై నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్స్ చేస్తున్నారు. లిరిక్స్‌, మ్యూజిక్ కంటే లిప్‌లాక్‌లే హైలైట్ అయ్యాయంటూ చెబుతోన్నారు. పాట చూస్తుంటే యానిమ‌ల్ మూవీ అర్జున్‌రెడ్డికి మ‌రో వెర్ష‌న్‌లా ఉంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఇన్ని లాప్‌లాక్‌లు అవ‌స‌ర‌మా అంటూ మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. యానిమ‌ల్ మూవీ డిసెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది. దాదాపు వంద కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

Whats_app_banner