Natu Natu for Oscars: గోల్డెన్‌ గ్లోబ్స్ గెలిస్తే ఆస్కార్ గెలిచినట్లేనా.. నాటు నాటుకు లైన్‌ క్లియర్‌!-natu natu for oscars as the song now eye on academy awards after winning golden globes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Natu Natu For Oscars: గోల్డెన్‌ గ్లోబ్స్ గెలిస్తే ఆస్కార్ గెలిచినట్లేనా.. నాటు నాటుకు లైన్‌ క్లియర్‌!

Natu Natu for Oscars: గోల్డెన్‌ గ్లోబ్స్ గెలిస్తే ఆస్కార్ గెలిచినట్లేనా.. నాటు నాటుకు లైన్‌ క్లియర్‌!

Hari Prasad S HT Telugu
Jan 11, 2023 03:06 PM IST

Natu Natu for Oscars: గోల్డెన్‌ గ్లోబ్స్ గెలిస్తే ఆస్కార్ గెలిచినట్లేనా? ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న. ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు జరిగే ఈ గోల్డెన్‌ గ్లోబ్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సాంగ్‌ నాటు నాటుకు అవార్డు రావడంతో ఆస్కార్స్‌ ఖాయంగా కనిపిస్తోంది.

నాటు నాటు సాంగ్ పై చరణ్, తారక్ స్టెప్పులు
నాటు నాటు సాంగ్ పై చరణ్, తారక్ స్టెప్పులు

Natu Natu for Oscars: తెలుగు వాడి సత్తా ఎంతో అంతర్జాతీయ వేదికపై తెలిసింది. గతేడాది ఇండియాలో సంచలన విజయం సాధించిన ఆర్‌ఆర్ఆర్‌ మూవీ.. ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపైనా దుమ్ము రేపుతోంది. ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్సకు నామినేట్‌ అవడమే కాదు.. ఇప్పుడు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఈ మూవీలోని నాటు నాటు నిలవడం విశేషం.

ఇక ఇప్పుడు మిగిలింది ఆస్కార్సే. ప్రపంచ సినీ రంగంలో దీనిని మించిన అవార్డు మరొకటి లేదని అంటారు. అలాంటి అవార్డుల రేసులోనూ ఆర్ఆర్ఆర్‌ ఉంది. ఇప్పుడు గోల్డెన్‌ గ్లోబ్స్‌ గెలవడంతో నాటు నాటు సాంగ్‌కు అకాడెమీ అవార్డు గెలిచే అవకాశాలు మరింత మెరగయ్యాయి. చాలా సందర్బాల్లో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలిస్తే ఆస్కార్స్‌ కూడా దాదాపు సొంతమైనట్లే అని చెబుతారు.

ఆ లెక్కన కనీసం నాటు నాటు సాంగ్‌కైతే లైన్‌ క్లియర్‌ అయినట్లే. అంతేకాదు ఆస్కార్స్‌ను అంచనా వేసే ప్రముఖ ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ వెరైటీలోనూ ఈ పాటకు మంచి ఛాన్స్‌ ఉన్నట్లు తేలింది. తాజాగా ఆ మ్యాగజైన్‌ అంచనా వేసిన దాని ప్రకారం.. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ రెండోస్థానంలో నిలవడం విశేషం. ఇప్పటికే ఈ పాట ఆస్కార్స్‌కు షార్ట్‌ లిస్ట్‌ కాగా.. గురువారం నుంచి ఓటింగ్‌ జరగనుంది.

జనవరి 24న ఫైనల్‌ నామినేషన్ల లిస్ట్‌ బయటకు వస్తుంది. అందులో ఇప్పుడు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలిచిన ఈ నాటు నాటు సాంగ్‌ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. నామినేషనే కాదు.. అవార్డు రావడం కూడా పక్కా అని వెరైటీ మ్యాగజైన్‌ ఓ కథనం ప్రచురించింది. ఇప్పుడు గోల్డెన్‌ గ్లోబ్స్‌లోనూ టేలర్‌ స్విఫ్ట్, రిహానాలాంటి వాళ్ల సాంగ్స్‌ను వెనక్కి నెట్టి నాటు నాటు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌గా నిలిచింది.

దీంతో ఆస్కార్స్‌లోనూ ఈ పాటకు అవార్డు రావడం ఖాయంగా కనిపిస్తోంది. బెస్ట్‌ నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్స్‌ కేటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్‌కు నిరాశే ఎదురైంది. ఆస్కార్స్‌లోనూ బెస్ట్‌ పిక్చర్‌ కేటగిరీకి ఆర్ఆర్ఆర్‌ నామినేట్‌ కావడం అంత సులువు కాకపోవచ్చు. కానీ సాంగ్‌కు మాత్రం మంచి ఛాన్స్‌ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో నెలలుగా అంతర్జాతీయ వేదికల్లో ఆర్‌ఆర్ఆర్‌ను ప్రమోట్‌ చేస్తున్న దర్శకుడు రాజమౌళి, మిగతా టీమ్ శ్రమ ఫలించినట్లే అని చెప్పొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం