Telugu Web Series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ - వికటకవి స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Web Series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన వికటకవి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను జీ5 ఓటీటీ అనౌన్స్‌చేసింది. డిటెక్టివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్‌సిరీస్‌లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Telugu Web Series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఫస్ట్ టైమ్ ఓ డిటెక్టివ్ వెబ్‌సిరీస్ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వికటకవి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. వికటకవి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను జీ5 అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. నవంబర్ 28న ఈ డిటెక్టివ్ వెబ్‌సిరీస్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ వెబ్‌సిరీస్‌ను విడుదలచేస్తోన్నారు.
మేఘా ఆకాష్...
వికటకవి వెబ్ సిరీస్‌లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఈ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు.
వికటకవి కాన్సెప్ట్ ఇదే...
హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని అమరగిరి అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. కొన్ని కారణాలతో అమరగిరి ప్రాంతంలోని సమస్యను పరిష్కరించడానికి డిటెక్టివ్ రామకృష్ణ ఆ ఊరికి వెళతాడు.
తన తెలివి తేటలతో ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, ప్రస్తుతం జరుగుతోన్న కుట్రల వెనుకున్న రహస్యాలను బయటపెడతాడు. ఈ ప్రయాణంలో డిటెక్టివ్ రామకృష్ణకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అమరిగిరి ప్రాంతంతో రామకృష్ణకు ఉన్న అనుబంధం ఏంటన్నది సిరీస్‌లో ఉత్కంఠను పంచుతుందని మేకర్స్ తెలిపారు.
తెలంగాణ యాస, భాషలతో...
కంప్లీట్‌గా తెలంగాణ యాస, భాషలతోనే ఈ వెబ్‌సిరీస్ సాగనున్నట్లు సమాచారం. ఆడియెన్స్ ఊహలకు అందని మలుపులతో ఈ వెబ్‌సిరీస్ సాగనున్నట్లు తెలిపారు. కంప్లీట్ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో స్టార్టింగ్ నుంచి చివరి వరకు థ్రిల్లింగ్‌ను పంచుతుందని చెబుతోన్నారు. వికటకవి వెబ్‌సిరీస్‌కు అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
పెళ్లి తర్వాత ఫస్ట్ వెబ్ సిరీస్...
పెళ్లి తర్వా త ఈ వెబ్‌సిరీస్‌తో ఫస్ట్ టైమ్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది మేఘా ఆకాష్. బాయ్‌ఫ్రెండ్ సాయివిష్ణుతో సెప్టెంబర్ నెలలో ఏడడుగులు వేసింది మేఘా ఆకాష్. నితిన్ లై మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్...రాజరాజచోర, డియర్ మేఘ, రావణాసురతో పాటు పలు సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్‌గా పదిహేనుకుపైగా సినిమాల్లో కనిపించింది.
చిన్న సినిమాలతో...
మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన లిమిటెడ్ బడ్జెట్ మూవీస్‌తో నటుడిగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు నరేష్ అగస్త్య. మత్తువదలరా మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు నరేష్ అగస్త్య. కలి, మాయలో, కిస్మత్, మెన్ టూ, పంచతంత్రంతోపాటు మరికొన్ని తెలుగులో సినిమాల్లో హీరోగా కనిపించాడు.