Meet Cute Teaser Release: క్యూట్‌గా ఉన్న మీట్ క్యూట్ టీజర్.. డైలాగ్స్ సింపుల్ అండ్ బ్యూటీఫుల్..!-nani producing web series meet cute teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Meet Cute Teaser Release: క్యూట్‌గా ఉన్న మీట్ క్యూట్ టీజర్.. డైలాగ్స్ సింపుల్ అండ్ బ్యూటీఫుల్..!

Meet Cute Teaser Release: క్యూట్‌గా ఉన్న మీట్ క్యూట్ టీజర్.. డైలాగ్స్ సింపుల్ అండ్ బ్యూటీఫుల్..!

Maragani Govardhan HT Telugu
Nov 12, 2022 04:45 PM IST

Meet Cute Teaser Release: నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా తెరకెక్కించిన సరికొత్త వెబ్ సిరీస్ మీట్ క్యూట్. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. సింపుల్, క్యూట్‌గా ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.

మీట్ క్యూట్ టీజర్ విడుదల
మీట్ క్యూట్ టీజర్ విడుదల

Meet Cute Teaser Release: నేచరల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్లో ఓ సరికొత్త వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు సినిమాలను నిర్మించిన నాని.. ఇప్పుడు మీట్ క్యూట్ అనే విభిన్న ఆంథాలజీ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఐదు విభిన్న కథల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌కు నాని సోదరు దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఈ టీజర్‌ను గమనిస్తే ఆద్యందం ఆసక్తికరంగా సాగింది. నటీనటుల మధ్య వచ్చే సంభాషణలు, అందుకు అనుగుణంగా వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనసును హత్తుకునేలా ఉంది. సింపుల్‌గా క్యూట్‌గా ఉన్న ఈ టీజర్.. సిరీస్‌పై అంచనాలను పెంచేసింది. చివర్లో అనుబంధాలు విఫలమయ్యేది ఈ చిన్న చిన్న గొడవల వల్ల కాదు.. గొడవ పడటం మానేసినప్పుడే అవి ఫెయిలవుతాయి అని సత్యరాజ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ఐదు ఎపిసోడ్స్‌తో సాగే ఈ సిరీస్‌కు నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించారు. సోని లివ్ వేదికగా త్వరలో ఈ ఆంథాలజీ సిరీస్ ప్రసారం కానుంది. ఇందులో సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రూహానీ శర్మ, సునైనా, సంచిత, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మ సూర్య, రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ వెబ్‌సిరీస్‌కు వసంత్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. విజయ్ బులగానిన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ పనులు చూస్తున్నారు. మీట్ క్యూట్ సిరీస్‌ను అర్ధవంతమైన సంభాషణలు, హృదయపూర్వక క్షణాలతో అందమైన యాదృచ్ఛిక సంఘటనలతో తెరకెక్కించారు దీప్తి గంటా.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్