Vijay Deverakonda Mrunal Thakur: విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ - సీతారామం బ్యూటీకి ఛాన్స్
Vijay Deverakonda Mrunal Thakur: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నది. వీరిద్దరి కాంబినేషన్‌లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ రాబోతున్నది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే...
Vijay Deverakonda Mrunal Thakur: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగులో లక్కీ ఛాన్స్‌ను అందుకొన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండతో ఆమె రొమాన్స్ చేయబోతున్నట్లు తెలిసింది. గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను ఫైనల్ చేసినట్లు తెలిసింది.
కథానుగుణంగా నాయకానాయికల రొమాన్స్, కెమిస్ట్రీ కీలకం కావడంతో ఈ రోల్‌కు తగిన హీరోయిన్ కోసం కొద్ది రోజులుగా అన్వేషిస్తోన్న పరశురామ్ చివరకు మృణాల్ ఠాకూర్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. పరశురామ్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్స్‌ను డామినేషన్ నేచర్‌తో డిఫరెంట్‌గా సాగుతుంటాయి. ఇందులో కూడా హీరో విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌పై ఆధిపత్యం చెలాయించే అమ్మాయిగా మృణాల్ ఠాకూర్ కనిపించబోతున్నట్లు తెలిసింది.
ఈ భారీ బడ్జెట్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి దిల్‌రాజు నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతోన్నాయి. సీతారామం సక్సెస్ తర్వాత నానితో కలిసి ఓ సినిమా చేస్తోంది మృణాల్ ఠాకూర్.
డిసెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు విజయ్ దేవరకొండ ఖుషి, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఖుషి సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. శివనిర్వాణ దర్శకత్వం వహిస్తోన్నాడు. గౌతమ్ తిన్ననూరి మూవీలో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో నటిస్తోన్నాడు.