Manchu Vishnu About MAA: వారికి 'మా' సభ్యత్వం శాశ్వతంగా రద్దు.. మంచు విష్ణు స్పష్టం-movie artists association president manchu vishnu press meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Vishnu About Maa: వారికి 'మా' సభ్యత్వం శాశ్వతంగా రద్దు.. మంచు విష్ణు స్పష్టం

Manchu Vishnu About MAA: వారికి 'మా' సభ్యత్వం శాశ్వతంగా రద్దు.. మంచు విష్ణు స్పష్టం

Maragani Govardhan HT Telugu
Oct 13, 2022 10:52 PM IST

Manchu Vishnu About MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసొసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తన మాకు ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించాడు. తను అధ్యక్షుడినైన తర్వాత 90 వాగ్ధానాలను పూర్తి చేశానని స్పష్టం చేశాడు.

<p>ప్రెస్ మీట్‌లో పాల్గొన్న మా అధ్యక్షుడు మంచు విష్ణు</p>
ప్రెస్ మీట్‌లో పాల్గొన్న మా అధ్యక్షుడు మంచు విష్ణు

Manchu Vishnu About MAA: గతేడాది జరిగిన తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికలు ఏ విధంగా చర్చనీయాంశమయ్యాయో అందరికీ తెలిసిందే. సాధారణ ఎన్నికలు తలపించేలా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్‌పై గెలిచిన మంచు విష్ణు చివరకు.. మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తాను మా ఎన్నికల్లో ఇచ్చిన 90 శాతం వాగ్ధానాలు పూర్తయ్యాయని, సంక్రాంతి తర్వాత మా కోసం యాప్ తీసుకొస్తానని స్పష్టం చేశాడు.

ఈ కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. “2021 అక్టోబరు 13న మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకున్నాను. ఆ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఈ ఎలక్షన్లపై ఆసక్తిపై చూపారు. నేను 'మా'కు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా జవాబుదారిని. మా అసొసియేషన్‌లో 20 శాతం మంది నటులు కానీ సభ్యులున్నారు. కాబట్టి సభ్యత్వం కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకోబోతున్నాం. అసొసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు. నటీ నటులు కనీసం రెండు చిత్రాల్లో నటించి, అవి విడుదలైతేనే వారికి మా అసొసియేషన్‌లో శాశ్వత సభ్యత్వ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు కనీసం పది సినిమాల్లోనైనా నటించి ఉండాలి. ఐదు నిమిషాలైన నటింపజేయాలని నిర్మాతలకు చెప్పాం. నిర్మాతల కౌన్సిల్ మా సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది” అని విష్ణు మంచు స్పష్టం చేశారు.

మా భవనానికి రెండు ప్రతిపాదనలు చేశాం: విష్ణు..

“మాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారి శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్ల శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. మా భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించా. ఫిల్మ్ నగర్ సమీపంలో ఓ భవనం నిర్మించాం. ప్రస్తుతమున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తా. చాలా మంది సభ్యులు రెండో దానికే ఆమోదం తెలిపారు. నటులందరికీ అవకాశం కల్పించాలనే అంశంపై ఓ పుస్తకాన్ని రూపొందించాం. దాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్‌తో పాటు నిర్మాతలందరికీ ఇచ్చాం. దీని ద్వారా ఇప్పటికే పది మందికి అవకాశాలు వచ్చాయి. మొబైల్ యాప్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి తర్వాత అందుబాటులోకి తీసుకొస్తాం." అని మంచి విష్ణు స్పష్టం చేశారు.

శాశ్వత సభ్యత్వం ఉన్నవారికే ఆరోగ్య బీమా..

"మా అసొసియేషన్‌లో శాశ్వత సభ్యత్వం ఉన్నవారికే ఆరోగ్య బీమా.. వర్తిస్తుందని, మా సభ్యులు కాని సుమారు ఆరుగురికి ఫింఛను రద్దు చేశామని స్పష్టం చేశారు. వారిలో ఓ నటుడి కూతురు కూడా ఉన్నట్లు తెలిపారు, ఆ నటుడు చనిపోయిన తర్వాత ఆ పింఛను ఆమెకు వస్తుండటంతో మా తరఫున క్యాన్సిల్ చేసి నేను వ్యక్తిగతంగా ఇస్తున్నా. 60 ఏళ్లు దాటినవారు, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నవారికే పెన్షన్ ఇస్తున్నాం" అని విష్ణు మంచు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం