Anushka Shetty Remuneration : హీరోలు కూడా ఇంత రెమ్యునరేషన్ తీసుకోరేమో.. ఒక్క సినిమాకు అనుష్క ఎంత తీసుకుంటుంది?
Anushka Shetty Remuneration : అనుష్క శెట్టి.. తెలుగు ప్రజలందరికీ బాగా తెలిసిన వ్యక్తి. బాహుబలి సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ నటి అయిన ఆమె రెమ్యునరేషన్ కూడా ఎక్కువే ఉంటుంది. ఒక్కో సినిమాకు ఆమె ఎంత పారితోషికం తీసుకుంటుంది?
నటి అనుష్క శెట్టి(Anushka Shetty) సౌత్ ఇండియాలో బాగా పాపులర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించింది. ప్రభాస్‌తో సహా చాలా మంది సూపర్‌స్టార్‌లతో స్క్రీన్‌ను పంచుకుంది. ఇప్పుడు అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr polishetty) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఆమె రెమ్యునరేషన్ మీద చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిసింది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా ఆమె పారితోషికం మాత్రం తగ్గలేదు.
మంగళూరులో జన్మించిన అనుష్క శెట్టి బెంగళూరులో చదువుకుంది. 2005లో నాగర్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమా(Super Cinema)తో అరంగేట్రం చేసింది. టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించింది. అయితే ఇటీవల అనుష్క తన సినిమాల ఎంపికలో తెలివిగా వ్యవహరిస్తోంది. ఏ సినిమా అయినా పెద్ద హిట్ అయితే ఆ సినిమా ఆర్టిస్టులు వరుసగా సినిమాలను అంగీకరిస్తారు. అనుష్క శెట్టి మాత్రం బాహుబలి 2(Bahubali) హిట్ తర్వాత కేవలం రెండు సినిమాల్లోనే నటించింది.
బాహుబలి 2 తర్వాత భాగమతి సినిమాలో కనిపించింది. ఈ సినిమా 2018లో విడుదలైంది. ఆ తర్వాత నిశ్శబ్దం సినిమా 2020లో విడుదలైంది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా వస్తోంది.
అనుష్క సినిమా ఇండస్ట్రీలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా పారితోషికం మాత్రం తగ్గలేదు. ఇంతకు ముందు ఒక్కో సినిమాకు 3 కోట్లు పారితోషికం తీసుకునేది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్త విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అనుష్క కొత్త సినిమా(Anushka New Movie) ఏదీ అంగీకరించలేదు.
అనుష్క శెట్టి వ్యక్తిగత విషయం కూడా చాలా చర్చనీయాంశమైంది. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో(Prabhas Anushka Love) ఉందని టాక్ ఉంది. బాహుబలి 2 తర్వాత వీరిద్దరూ విడిపోయారనే వార్త కూడా హల్‌చల్ చేసింది. దీనిపై ప్రభాస్ కానీ, అనుష్క కానీ మాట్లాడలేదు.