Megha Akash: ఈ ఇయ‌ర్‌లో ఇది ఏడో సినిమా - మేఘా ఆకాష్ స్పీడు మామూలుగా లేదుగా!-megha akash ram kiran sahakutumbanaam officially launched ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Megha Akash: ఈ ఇయ‌ర్‌లో ఇది ఏడో సినిమా - మేఘా ఆకాష్ స్పీడు మామూలుగా లేదుగా!

Megha Akash: ఈ ఇయ‌ర్‌లో ఇది ఏడో సినిమా - మేఘా ఆకాష్ స్పీడు మామూలుగా లేదుగా!

HT Telugu Desk HT Telugu
Sep 25, 2023 07:03 AM IST

Megha Akash: ఈ ఏడాది తెలుగు, త‌మిళ భాష‌ల్లో మేఘాఆకాష్ న‌టించిన ఆరు సినిమాలు రిలీజ‌య్యాయి. తాజాగా ఆమె ఏడో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. స‌హ‌కుటుంబ‌నాం టైటిల్‌తో కొత్త సినిమా చేస్తోంది.

స‌హ‌కుటుంబ‌నాం మూవీ
స‌హ‌కుటుంబ‌నాం మూవీ

Megha Akash: తెలుగులో రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తోంది మేఘాఆకాష్‌. 2023లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆమె హీరోయిన్‌గా న‌టించిన ఆరు సినిమాలు రిలీజ‌య్యాయి. తాజాగా మ‌రో కొత్త సినిమాకు మేఘాఆకాష్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. స‌హ‌కుటుంబ‌నాం పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో రామ్‌కిర‌ణ్ హీరోగా న‌టిస్తున్నాడు.

ఈ సినిమాకు ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా స‌హ‌కుటుంబ‌నాం తెర‌కెక్కుతోంది. ఇందులో సిరి అనే అమ్మాయిగా న‌టిస్తోన్న‌ట్లు మేఘాఆకాష్ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు చేసిన బ‌బ్లీ క్యారెక్ట‌ర్స్‌కు భిన్నమైన పాత్ర‌లో ఇందులో తాను క‌నిపించ‌బోతున్న‌ట్లు మేఘా ఆకాష్ చెప్పింది. క‌థే ఈ సినిమాకు హీరో అని ప్రొడ్యూస‌ర్ చెప్పాడు. స‌హ‌కుటుంబ‌నాం సినిమాకు మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.

రాజేంద్ర‌ప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, రాహుల్ రామ‌కృష్ణ‌, స‌త్య‌తో పాటు ప‌లువురు న‌టీన‌టుల‌కు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌లో ఏఎమ్‌ర‌త్నం, డ్యాన్స్‌మాస్ట‌ర్ చిన్నిప్ర‌కాష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. కాగా ఈ ఏడాది మేఘాఆకాష్ న‌టించిన రావ‌ణాసుర‌, ప్రేమ‌దేశం, మ‌ను చ‌రిత్ర‌, బూతో పాటు మ‌రో రెండు త‌మిళ సినిమాలు రిలీజ‌య్యాయి.

రావ‌ణాసుర‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించింది. ప్ర‌స్తుతం స‌హ‌కుటుంబ‌నాంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో మ‌రో మూడు సినిమాల్లో న‌టిస్తోంది. 2018లో రిలీజైన నితిన్ లై సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘాఆకాష్‌. అవ‌కాశాలు భారీగానే వ‌స్తోన్న స‌క్సెస్‌లు మాత్రం ద‌క్క‌డం లేదు.