OTT Thriller Movies: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు మలయాళం థ్రిల్లర్ మూవీస్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Thriller Movies: మలయాళం థ్రిల్లర్ మూవీస్ కొండల్, లెవెల్ క్రాస్ ఆదివారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కొండల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాగా...లెవెల్ క్రాస్ అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు సినిమాలు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చాయి.
OTT Thriller Movies: ఆదివారం ఓటీటీ ఆడియెన్స్ ముందుకు ఒకేసారి రెండు మలయాళం థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ కొండల్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాగా..ప్యారాలాల్ లైఫ్ కాన్సెప్ట్‌తో వచ్చిన లెవెల్ క్రాస్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియతో పాటు ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు సినిమాలను తెలుగులోనూ చూడొచ్చు. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ విడుదలయ్యాయి.
అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్...
కొండల్ మూవీలో అంథోనీ వర్గీస్, గౌతమీనాయర్ హీరోహీరోయిన్లుగా నటించారు. రాజ్ బీ శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి అజీత్ మాంపల్లి దర్శకత్వం వహించాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం అభిమానులను అలరించాయి.
సోదరుడి మరణంపై రివేంజ్...
ఇమాన్యుయ్యేల్ చేపలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కుటుంబమే అతడి ప్రపంచం. అన్నయ్య డానీ (రాజ్ బీ శెట్టి) మరణంతో ఇమాన్యుయేల్ జీవితం మొత్తం తలక్రిందులవుతుంది. అదే టైమ్‌లో చేపలు పట్టే విషయంలో జూడ్, మైఖేల్‌లతో ఇమాన్యుయేల్ గొడవపడతాడు. వారి కారణంగా అన్నయ్య మరణానికి సంబంధించిన సీక్రెట్ ఇమాన్యుయేల్‌కు తెలుస్తుంది. అదేమిటి?
చేపల వేటకు సముద్రంలో అడుగుపెట్టిన ఇమాన్యుయేల్‌ను చంపేందుకు జూడ్, మైఖేల్ ఎందుకు ప్రయత్నించారు. వారిని ఇమాన్యుయేల్ ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే ఈ మూవీ కథ. కొండల్ కంటే ముందు మలయాళంలో అంగమలై డైరీస్, జల్లికట్లు, అజగజంతరం, ఆర్‌డీఎక్స్ సినిమాలు చేశాడు ఆంథోనీ వర్గీస్.
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ...
ఆసిఫ్ అలీ, అమలాపాల్ హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళంసైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లెవెల్ క్రాస్ ఆదివారం అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా తమిళ్ ఓటీటీలో రిలీజైంది. ఈ మలయాళం మూవీని తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు.
దృశ్యం దర్శకుడు..
లెవెల్ క్రాస్ మూవీకి దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరించాడు. జీతూ జోసెఫ్ శిష్యుడు అర్ఫాజ్ అయూబ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లెవెల్ క్రాస్ మూవీ రెండు కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది.
లెవెల్ క్రాస్ కథ ఇదే...
శిఖా (అమలాపాల్) ఓ సైకలాజిస్ట్. . మానసిక సమస్యలతో బాధపడుతోన్న శిఖా డాక్టర్ జింకోను కలుస్తుంది. అక్కడే ఆమె కొత్త వరల్డ్ లోకి ఎంటర్ అవుతుంది. ఎడారికి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో రైల్వే గేట్‌మెన్‌గా పనిచేస్తున్న రఘు (ఆసిఫ్ అలీ) ఎడారికి సమీపంలో ఉన్న లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్వే గేట్‌మెన్‌గా పనిచేస్తుంటాడు.
ఒంటరి లైఫ్‌కు అలవాటుపడిన అతడి జీవితంలోకి అనుకోకుండా చైతాలి వస్తుంది. ఆమె ఎవరు? చైతాలి, రఘు పోలికలతోనే మరో వరల్డ్‌లో ఉన్న శిఖా, జార్జ్‌లకు వీరితో ఉన్న సంబంధం ఏమిటన్నదే లెవెల్ క్రాస్ మూవీ కథ. ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, అమలాపాల్ ఇద్దరు డ్యూయల్ రోల్స్‌లో కనిపించడం గమనార్హం. కొండల్, లెవెల్ క్రాస్ ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో రిలీజయ్యాయి.