Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?-madgaon express ott streaming amazon prime animal actor upendra limaye mirzapur actor divyendu ott movies kunal khemu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Madgaon Express Ott: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
May 17, 2024 01:18 PM IST

Madgaon Express OTT Streaming Now: యానిమల్ యాక్టర్ ఉపేంద్ర లిమాయే నటించిన సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ మూవీ మడ్గావ్ ఎక్స్‌ప్రెస్. వాటే విజన్ వాటే థాట్ అంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న లిమయే కామెడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాల్లోకి వెళితే..

ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Madgaon Express OTT Release: బాలీవుడ్ యంగ్ హీరో కునాల్ ఖేము దర్శకుడిగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన కామెడీ చిత్రం మడ్గావ్ ఎక్స్‌ప్రెస్‌. చేసింది మొదటి సినిమా అయిన విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ సాధించినప్పటికీ ప్రేక్షకుల నుంచి మాత్రం విపరీతమైన ఆదరణ పొందింది

రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 44.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మార్చి 22న విడుదలైన ఈ సినిమాకు 10కి 7.5 రేటింగ్‌ను ఇచ్చింది ఐఎమ్‌డీబీ సంస్థ. ఈ సినిమాలో కునాన్ ఖేముతోపాటు మీర్జాపూర్ వెబ్ సిరీస్ నటుడు దివ్యేందు, స్కామ్ 1992 హీరో ప్రతీక్ గాంధీ, బాహుబలి ఐటమ్ సాంగ్ బ్యూటి నోరా ఫతేహి, యానిమల్ యాక్టర్ ఉపేంద్ర లిమాయే, ఛాయా కదమ్, ఆయుష్ గుప్తా, కొరియేగ్రాఫర్ రెమో డిసౌజా కీలక పాత్రలు పోషించారు.

ఇలా బాలీవుడ్ పాపులర్ క్యాస్ట్‌తో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీలోకి వచ్చేసింది. మే 16 అంటే గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమా ప్రస్తుతం కేవలం హిందీ భాషలోనే డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తెలుగులో మాత్రం చూడలేరు. కానీ, కామెడీ సినిమాలు నచ్చేవారు చూడాలనుకుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో దీన్ని ఎంజాయ్ చేయొచ్చు.

యానిమల్ సినిమాలో వాటే విజన్.. వాటే థాట్ అనే డైలాగ్‌తో ఎంతో పాపులర్ అయ్యాడు ఉపేంద్ర లిమాయే. మరాఠికి చెందిన ఆయన డైలాగ్‌తో ఎన్నో రకాల మీమ్స్, పోస్ట్స్ నెట్టింట్లో దర్శనం ఇచ్చాయి. ఇక దివ్యేందు మీర్జాపూర్ వెబ్ సిరీస్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇందులో మున్నా భయ్యాగా ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకున్నాడు.

బాలీవుడ్ యంగ్ హీరో కునాల్ ఖేము ఎన్నో రకాల సినిమాలతో అలరించాడు. కలియుగ్, గో గోవా గాన్, భాగ్ జానీ సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మలంగ్ సినిమాలో విలన్ రోల్ పోషించి ఆకట్టుకున్నాడు. గోల్ మాల్ అగైన్, బ్లడ్ మనీ వంటి ఇతర సినిమాల్లో సైడ్ హీరోగా మెప్పించాడు కునాల్ ఖేము. ఇటీవల మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ మూవీతో డైరెక్టర్‌గా మారి దర్శకుడిగా అభినందనలు అందుకున్నాడు.

మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీపై అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన ఇస్తూ పోస్టర్ సైతం విడుదల చేసింది. ఇక మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ కథ విషయానికొస్తే ముగ్గురు చిన్ననాటి స్నేహితులైన ప్రతీక్ గాంధీ, దివ్యేందు అండ్ అవినాష్ తివారీల గోవా టూర్ కథాంశంగా ఉంటుంది. గోవాకు వెళ్లిన ఈ ముగ్గురు ఫ్రెండ్స్ నేర ప్రపంచంలో ఎలా చిక్కుకున్నారు, దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేదే సినిమా కథ.

డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీపై కునాల్ ఖేము స్పందించాడు. "అసలు నేను సినిమా చేయగలనా అని అనిపించింది. ముందు దీన్ని నేను ఒక స్క్రిప్ట్ రైటింగ్‌కు ప్రాక్టీస్ సెషన్ లాగా అనుకున్నాను. ఇదంతా నేను సాగించిన ఒంటరి ప్రయాణం. నేను స్టోరీ రాస్తున్నట్లు ఎవరికీ తెలియదు. ఇది వర్కౌట్ అయితే సినిమాలో నేను ఒక పాత్ర చేద్దామని అనుకున్నాను అంతే. కామెడీ అనేది ఎక్కువ శాతం మందికి నచ్చే జోనర్. నాకు కామెడీ సినిమాలంటే ఇష్టం" అని తెలిపాడు కునాల్ ఖేము.

టీ20 వరల్డ్ కప్ 2024